Begin typing your search above and press return to search.
దసరాకి 'వడ చెన్నై' తినిపిస్తారట!
By: Tupaki Desk | 24 Aug 2018 9:40 AM GMTతమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు - స్టార్ హీరో ధనుష్ కు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ - బాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. `వై దిస్ కోలావెరి` తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ధనుష్...`ది ఎక్స్ ట్రార్డినరీ జర్నీ ఆప్ ది ఫకీర్`తో హాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు. విలక్షణ కథలతో ప్రేక్షకులను అలరించే ధనుష్....తాజాగా `వడ చెన్నై` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం కోసం ధనుష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత నెల ధనుష్ పుట్టిన రోజు కానుకగా విడుదలైన `వడ చెన్నై` చిత్రం టీజర్ ఆ అంచనాలను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో తాజాగా - ఆ చిత్ర రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. అక్టోబరు 17న దసరా కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.
ఈ ఇద్దరి కాంబోలో ఏడేళ్ల క్రితం వచ్చిన `ఆడుగాలం`(తెలుగులో పందెంకోళ్లు)సినిమా ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలనూ దక్కించుకుంది. ధనుష్ కు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం తెచ్చిపెట్టిన ఆ చిత్రం తర్వాత ఈ కాంబో లో రాబోతోన్న`వడ చెన్నై`పై కోలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. అన్బు అనే నేషనల్ లెవెల్ క్యారమ్ ప్లేయర్ పాత్రను ధనుష్ పోషిస్తున్నాడు. చిత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని....ఇందులో రెండు మూడు గెటప్స్ లో కనిపించేందుకు ప్రయత్నించానని ధనుష్ అన్నాడు. ఆవారాగా తిరిగే ఓ యువకుడు... ఆ తర్వాత పరిస్థితుల కారణంగా గ్యాంగ్ స్టర్ గా మారడం...గ్యాంగ్ వార్ నేపథ్యంలో ఈ కథ సాగనుంది. గుడిసెలైనా...చెత్త కుప్పలైనా....మన ప్రాంతాన్ని - ఊరిని మనమే కాపాడుకోవాలనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మోస్ట్ అవెయిటెడ్ సినిమాను అక్టోబరు 17న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘పందెంకోడి-2’తో పాటు మరో రెండు సినిమాలు వడ చెన్నైకి పోటీగా విడుదల కాబోతున్నాయి.