Begin typing your search above and press return to search.
కాలి నడక దూరానికే అద్దె కార్ కోరాడట!
By: Tupaki Desk | 10 Dec 2019 1:30 AM GMTకొందరు స్టార్ల గొంతెమ్మ కోర్కెలు తీర్చేందుకు నిర్మాతలు తల తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందని అంటారు. అయిన దానికి కాని దానికి ఖర్చు అదుపు తప్పే వెతలు ఆన్ లొకేషన్ ఎన్నో ఉంటాయని మారిన ట్రెండ్ లో క్లాసిక్ డేస్ నిర్మాతలు కనుమరుగవ్వడానికి కారణం ఇదేనని చెబుతుంటారు. హీరోల చేతిలోకి పరిశ్రమ వెళ్లిపోవడం వల్లనే ఇంత నాశనం అయ్యిందని దర్శకరత్న దాసరి నారాయణరావు పదే పదే గుర్తు చేసేవారు.
అయితే అంత పెద్ద ఆరోపణ కాదు కానీ.. తమిళ స్టార్ హీరో ధనుష్ పై ఊహించని ఆరోపణ ఎదురైంది. ఆయన ఆన్ లొకేషన్ వ్యవహరించిన తీరు ఆ నిర్మాతకు తల బొప్పి కట్టించిందన్నది ఆ ఆరోపణ. ధనుష్ కి ఏర్పాటు చేసిన బస నుంచి కేవలం కాలి నడకన వెళ్లేంత దూరంలోనే షూటింగ్ జరుగుతోందట. అయినా అతడి కోసం ఇన్నోవా కార్ ని ఎరేంజ్ చేశారు. కానీ ఆ కార్ లో వెళ్లేందుకు ససేమిరా అన్నాడట. పైగా ఆడి కార్ అయితేనే షూట్లో పాల్గొంటానని సతాయించాడట. దాంతో ఆ చిన్న దూరానికే రోజుకు 20 వేల రెంట్ బాదుడుతో ఆడి కార్ ని 40 రోజుల పాటు సెట్లో తిప్పాల్సి వచ్చిందట.
ఈ సీన్ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పటాస్ షూటింగ్ లో జరిగింది. ధనుష్ కథానాయకుడిగా ఆర్.ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో సత్య జ్యోతి ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో మెహ్రీన్ కథానాయిక కాగా స్నేహ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆడి కార్ కావాల్సిందేనంటూ ధనుష్ చేసిన యాగీపై ఎవరో యూనిట్ సభ్యుడే సోషల్ మీడియాలో లీక్ చేయడంతో నెటిజనుల్లో అది కాస్తా హాట్ టాపిక్ గా మారింది. ధనుష్ తన రూమ్ నుంచి లొకేషన్ కి వెళ్లడానికి ఫర్లాంగు దూరమే. అయితే అభిమానుల తాకిడి ఉండడం వల్ల అలా కార్ ఎరేంజ్ చేయాల్సి వచ్చిందట. ధనుష్ డిమాండ్ సరికాదని .. ఆయన ఒక నిర్మాత అయి ఉండీ ఇలా నిర్మాత జేబు గుల్ల చేస్తాడా? అంటూ నెటిజనులు ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది. అసురన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ధనుష్ ఎంతో కేర్ తీసుకుని నటిస్తున్న చిత్రమిది.