Begin typing your search above and press return to search.
స్టార్ హీరో గుండు లుక్ వైరల్
By: Tupaki Desk | 3 July 2023 10:03 PM ISTతమిళ్ స్టార్ హీరో ధనుష్ తెలుగు లో సార్ సినిమా తో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ముందు ఆయన నటించిన సినిమాలన్నీ కూడా తెలుగు బాక్సాఫీస్ వద్ద మినిమం వసూళ్లు సాధిస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ధనుష్ తమిళం తో పాటు హిందీ.. ఇంగ్లీష్ మరియు తెలుగు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.
సార్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో మరియు ఆ తర్వాత కూడా ధనుష్ పెద్ద జుట్టు మరియు గుబురు గడ్డం తో కనిపించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో ధనుష్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ధనుష్ కొత్త లుక్ మళ్లీ వార్తల్లో నిలిచింది.
తాజాగా తిరుపతి లో ధనుష్ సందడి చేశాడు. అక్కడ తన పిల్లలతో కలిసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అంతే కాకుండా శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు ఇచ్చాడు. గుండు లో ధనుష్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ధనుష్ చేస్తున్న సినిమా ల్లో గుండుతో కనిపిస్తాడా లేదంటే విగ్గు ఏమైనా ట్రై చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఒక స్టార్ హీరో గుండు చేయించుకోవడం చాలా చాలా రేర్ గా జరుగుతుంది. ధనుష్ తనకు ఉన్న భక్తితో పాటు సింప్లిసిటీని నిరూపించుకుంటూ గుండులో కనిపించాడు.