Begin typing your search above and press return to search.
నేను లవ్ ఫెయిల్యూర్ అంటున్న హీరోయిన్
By: Tupaki Desk | 21 Oct 2016 1:30 AM GMTధన్య బాలకృష్ణన్.. పేరు అంత ఫేమస్ కాదు కానీ.. ఇటు తెలుగులో అటు తమిళంలో చాలా సినిమాలే చేసింది. చాలా వరకు హీరోయిన్ ఫ్రెండు క్యారెక్టర్లలో చేస్తూ వచ్చిన ధన్య.. ‘రాజు గారి గది’ లాంటి సినిమాల్లో కథానాయిక పాత్ర కూడా చేసింది. తాజాగా ‘తను వచ్చెనంట’ సినిమాలోనూ రష్మితో పాటు మరో హీరోయిన్ గా నటించింది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ప్రేమలో విఫలమయ్యానని.. దాని వల్ల ఓ దశలో చాలా బాధపడ్డానని చెప్పింది ధన్య.
‘‘గతంలో నేను ఒకబ్బాయితో ప్రేమలో పడ్డాను. ఇద్దరం రిలేషన్ షిప్ లో ఉన్నాం. కానీ ఆ ప్రేమ విఫలమైంది. అప్పట్లో చాలా బాధపడ్డాను. కానీ ఇంకేం చేద్దాం. అలాగే ఏడుస్తూ కూర్చోలేం కదా. జీవితం ఉన్నది ఒక్కటే. దాన్ని వృథా చేస్తూ కూర్చోలేం అని బయటికి వచ్చేశాను. కొన్ని కారణాల వల్ల ఆ రిలేషన్ షిప్ వర్కవుట్ కాలేదు. ఆ వ్యక్తి ఇండస్ట్రీకి చెందినవాడు కాదు. ప్రస్తుతం నేను నా పనిని మాత్రమే ప్రేమిస్తున్నాను’’ అని ధన్య చెప్పింది.
ఇక కెరీర్ గురించి మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే ఇప్పుడు తనకు మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలే వస్తున్నట్లు ధన్య చెప్పింది. ‘‘ఒకప్పుడు నాకు ఎక్కువగా హీరోయిన్ ఫ్రెండు పాత్రలే ఇచ్చేవాళ్లు. అందులోనూ ‘రాజారాణి’లో నయనతారకు ఫ్రెండుగా చేశాక ఆమె సినిమాలు నాలుగైదింట్లో అలాంటి పాత్రలే ఇచ్చారు. దీంతో అలాంటి వాటికి నో చెప్పేశాను. ఇప్పుడు పరిస్థితి మారింది. వైవిధ్యమైన.. ప్రాధాన్యమున్న పాత్రలు ఇస్తున్నారు’’ అని ధన్య తెలిపింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/