Begin typing your search above and press return to search.
కార్తీకంటే కోడికే ఓటు
By: Tupaki Desk | 3 Nov 2016 4:57 AM GMTఎప్పటిలానే దీపావళి సీజన్ లో తెలుగు సినిమాలకంటే పరాయిభాషా చిత్రాల సందడికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వేదికైంది. తమిళనాట ఇద్దరు పెద్ద హీరోలైన కార్తీ, ధనుష్ ల సినిమాలు పోటీకి సై అన్నాయి. కార్తీ కాష్మోరాగా వస్తే ధనుష్ కోడి(ధర్మయోగి) లతో ద్విపాత్రాభినయం చేశారు.
వీటిలో హైప్ తో కాష్మోరా విడుదలైతే ఎటువంటి అంచనాలు లేకుండా ఒకరోజు లేట్ గా ధర్మయోగి మనముందుకొచ్చింది. కలెక్షన్ల విషయంలో తొలుత కాష్మోరానే పైచేయి సాధించినా వారం తిరిగే సరికి పరిస్థితి తారుమారైంది. మౌత్ టాక్ తో, పాజిటీవ్ రివ్యూస్ తో ధనుష్ చిత్రం కలెక్షన్ల వేగం పుంజుకుంది.
రెండోవారానికి వచ్చేసరికి కాష్మోరాకి స్క్రీన్ కౌంట్ తగ్గించగా ధర్మయోగికి నైజాంలోనే 30 స్క్రీన్ లు పెంచడం గమనార్హం. ఈవారం ఇక్కడ సుమంత్ నరుడా డోనరుడా సినిమా తప్ప మరో పేరున్న సినిమా విడుదల లేకపోవడంతో రెండోవారం కంటిన్యూ అయ్యే చిత్రానికి మంచి లాభమేనని ట్రేడ్ పండితుల భావన.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/