Begin typing your search above and press return to search.
ప్రోమో: అల్లు శిరీష్ కోసం సిద్ శ్రీరామ్ పాడిన లవ్లీ మెలోడీ..!
By: Tupaki Desk | 7 Oct 2022 5:04 AM GMTటాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా ''ఉర్వశివో రాక్షసివో''. ఇందులో మలయాళ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే నెలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటి వరకూ 'ఊర్వశివో రాక్షశివో' సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. కొన్ని రోజుల క్రితం మేకర్స్ విడుదల చేసిన టీజర్ కు ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
'ఊర్వశివో రాక్షసివో' చిత్రం నుండి "దీంతననా" అనే పాటను అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా తాజాగా సాంగ్ ప్రోమోని మేకర్స్ సోషల్ మీడియాలో వదిలారు.
'అనగననగా.. కనులే కనగలగా.. నిజమై మెరుపల్లే వాలెనా.. నా ఊపిరి నడకా.. తన ఊపిరి జతగా.. కలగలిసి మొదలయ్యే నాలో అలజడిగా..' అంటూ సాగిన ఈ ప్రోమో శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. అచ్చు రాజమణి ఈ గీతానికి సంగీతం సమకూర్చారు.
"దీంతననా" పాటను మ్యూజిక్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. యువ గాయకుడు మరోసారి తన వాయిస్ తో మ్యాజిక్ చేయబోతున్నట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. తను ప్రేమించిన అమ్మాయి గురించి ప్రేమికుడు పాడుకునేలా పూర్ణ చారీ అర్థవంతమైన సాహిత్యం అందించారు. దీనికి విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ చేశారు.
విజువల్ గానూ ఈ సాంగ్ ప్రోమో ఆకర్షణనీయంగా ఉంది. అల్లు శిరీష్ మరియు అను ఇమ్మాన్యుయేల్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు తెలుస్తుంది. ఫుల్ సాంగ్ ని సోమవారం విడుదల చేయనున్నారు.
''ఊర్వశివో రాక్షసివో'' చిత్రానికి రాకేశ్ శశి దర్శకత్వం వహించారు. ఇందులో వెన్నెల కిషోర్ - పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలు పోషించారు. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని రూపొందించారు.
ధీరజ్ మొగిలినేని నిర్మింస్తున్న ఈ చిత్రానికి విజయ్ ఎం సహ నిర్మాతగా వ్యవహారించారు. తన్వీర్ మిర్ సినిమాటోగ్రఫీ అందించగా.. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్ గా.. బాబు ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.
న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'ఊర్వశివో రాక్షసివో' చిత్రాన్ని 2022 నవంబర్ 4వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.