Begin typing your search above and press return to search.
ధోని నిర్మిస్తున్న సినిమా.. తెలుగులో కూడా
By: Tupaki Desk | 16 Jun 2023 8:39 PMభారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన సంస్థ ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ బ్యానర్‌లో ధోని తన తొలి ప్రాజెక్ట్ "LGM"కి ప్రత్యేకంగా ప్రమోషన్ లో మద్దతు కూడా ఇస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఎల్‌జిఎమ్‌ని దర్శకుడు రమేష్ తమిళమణి తెరపైకి తీసుకు వస్తున్నాడు. సాక్షి ధోని నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇక షూటింగ్ దశను పూర్తి చేసుకున్న LGM ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఆ పనులు కూడా ముగింపు దశకు చేరుకుంటున్నాయి. కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో మంచి ఎమోషన్ కూడా ఉండనుందట. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు ఈ సినిమాను తెరపై తీసుకు వస్తున్నట్లుగా ఇదివరకే చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.
ధోని ఇదివరకే రెండు మూడు కథలు విన్నప్పటికీ కూడా ఈ LGM కథ బాగా నచ్చడంతో దీని ద్వారానే తన ప్రొడక్షన్ హౌస్ లో స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరొక కీలకమైన అప్డేట్ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమాను తెలుగు ఆడియోన్స్ ముందుకు కూడా తీసుకురావడానికి సిద్ధమయింది. మంచి కంటెంట్ తో వచ్చే కథలను తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ కూడా ఆదరిస్తారు అని అందరికీ తెలిసిందే.
ఇక ఇప్పుడు ఎల్జీఎం సినిమాకు కూడా అదే స్థాయిలో మద్దతు లభిస్తుంది అని చిత్ర యూనిట్ తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అయింది. MS ధోని, సాక్షి సింగ్ ధోనీ ప్రత్యేక అతిధులుగా ఈ చిత్రం ఆడియో ట్రైలర్ లాంచ్ ను త్వరలోనే నిర్వహించనున్నారు.
ఇప్పటివరకు LGM పట్ల చూపిన అపారమైన ప్రేమ మరియు మద్దతుకు బృందం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఇటీవల విడుదలైన LGM టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది, వివిధ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో తక్కువ వ్యవధిలో 7 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి దర్శకుడు రమేష్ తమిళ్మణి దర్శకత్వం వహించడమే కాకుండా సంగీతాన్ని కూడా సమకూరుస్తున్నాడు. ఈ చిత్రంలో హరీష్ కళ్యాణ్, నదియా, ఇవానా, యోగి బాబు, మిర్చి విజయ్ మరియు అనేక ఇతర ప్రామిసింగ్ నటీనటులతో సహా ప్రతిభావంతులైన సమిష్టి తారాగణం ఉంది.