Begin typing your search above and press return to search.

'దూమ్ ధామ్ దోస్తాని'కి డేట్ ఫిక్స్ చేసిన ద‌స‌రా స్టార్!

By:  Tupaki Desk   |   29 Sep 2022 9:32 AM GMT
దూమ్ ధామ్ దోస్తానికి డేట్ ఫిక్స్ చేసిన ద‌స‌రా స్టార్!
X
నేచుర‌ల్ స్టార్ నాని వేగానికి బ్రేక్ ప‌డింది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్ని లైన్ లో పెట్టే నాని లో ఇప్పుడా వేగం క‌నిపించ‌లేదు. ఒక సినిమా సెట్ లో ఉంగానే రెండు...మూడు ప్రాజెక్ట్ ల ప్ర‌క‌ట‌న‌తో ముందుండే? నానిలో ఇప్పుడు ఆ ఊసే క‌నిపించ‌లేదు. ప్ర‌స్తుతం నాని కొత్త మేక‌ర్ శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో 'ద‌స‌రా'లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

తెలంగాణ ద‌స‌రా నేప‌థ్యంలో సాగే స్టోరీ ఇది. ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్. ఇప్ప‌టికే నాని ర‌గ్గ‌డ్ లుక్ సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చింది. సినిమాపై మంచి అంచ‌నాలే కూడా ఉన్నాయి. చిత్రీక‌ర‌ణ స‌హా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తిచేసి వీలైనంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని భావిస్తున్నారు. రిలీజ్ ని పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా ద‌స‌రా గురించి నాని ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందించారు. ఇక‌పై సంగీత ప్రియులు రెడీగా ఉండండి అంటూ హింట్ ఇచ్చేసారు. ద‌స‌రా సంద‌ర్భంగా సినిమా నుంచి తొలి లిరిక‌ల్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 'దూమ్ ధామ్ దోస్తానా' అంటూ సాగే తొలి సింగిల్ కి అక్టోబ‌ర్ 5 గా డేట్ ఫిక్స్ చేసారు.

సంతోష్ నారాయణన్ సంగీతంలో రూపొందిన పాట‌కి ప్రేమ్ రక్షిత్ కొరిగ్ర‌ఫీ అందించారు. ఇది ప‌క్కా మాస్ నెంబ‌ర్ లా ఉంది. తెలంగాణ యువ‌త‌కి బాగా క‌నెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్ర‌స్తుతం తెంలంగాణ మాస్ బీట్ కంపోజింగ్ కి మంచి డిమాండ్ ఉంది. యువ‌తకి ఆ పాట‌లు క్రేజీ ఫీల్ ని అందిస్తున్నాయి. మ‌రి దూమ్ ధామ్ సంగతి తేలాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇక‌పై కంటున్యూస్ గా ద‌స‌రా పాట‌లు ఒక్కొక్క‌టిగా రిలీజ్ కానున్నాయి. అటుపై ట్రైల‌ర్..టీజ‌ర్ అంటూ నాని హంగామా పతాక స్థాయిలో ఉంటుంది. ఇందులో నానికి జోడిగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. సాయి కుమార్..స‌ముద్ర‌ఖ‌ని...జ‌రీనా వ‌హాబ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తిచేసి వ‌చ్చే ఏడాది మార్చి 30న సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.