Begin typing your search above and press return to search.
నాన్న ముందు నటించనన్న స్టార్ కిడ్
By: Tupaki Desk | 18 July 2019 5:08 AM GMTఅపరిచితుడుతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ త్వరలో అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మ రూపంలో పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ముందు బాలా దర్శకత్వంలో తీసిన ఫస్ట్ వెర్షన్ ని పక్కన పెట్టేసి సందీప్ వంగా శిష్యుడు గిరిసాయాతో మొత్తం మళ్ళీ తీయడం పరిశ్రమలో సంచలనంగా నిలిచింది. ఇప్పుడిది షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఇటీవలే విడుదలైన హిందీ రీమేక్ కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ కావడంతో ఎక్కువ పోలిక రాకుండా ఉండేందుకు ఆదిత్య వర్మకు కొంచెం గ్యాప్ ఇస్తున్నారు. డేట్ ని త్వరలో అనౌన్స్ చేస్తారు. తన మిస్టర్ కేకే ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన విక్రమ్ మీడియా ఇంటర్వ్యూలలో భాగంగా ధృవ్ గురించి ఒక ఆసక్తికరమైన అప్ డేట్ షేర్ చేసుకున్నాడు
ధృవ్ ఇటీవలే ఆదిత్య వర్మకు డబ్బింగ్ చెప్పేందుకు రెడీ అవుతుండగా స్టూడియోకు విక్రమ్ వచ్చాడు. దీంతో నాన్నను చూడగానే షాక్ తిన్న ధృవ్ ఆయన పక్కన ఉంటే తనకు మొహమాటంగా ఉంటుందని నటిస్తూ డబ్బింగ్ చెప్పడానికి భయం వేస్తుందని చెప్పాడట. దాంతో విక్రమ్ సర్దిచెప్పి తనను తండ్రిలా కాకుండా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా చూస్తే అలాంటి ఫీలింగ్ ఏమి రాదని ధైర్యం చెప్పి దగ్గరుండి మరీ సలహాలు సూచనలు ఇచ్చాడట.
వాటిని ఫాలో అయిపోయిన ధృవ్ అనుకున్న దాని కన్నా మంచి అవుట్ ఫుట్ ఇవ్వడం చూసి యూనిట్ ఫుల్ హ్యాపీ. ఆదిత్య వర్మ హిట్ తో పుత్రోత్సాహాన్ని అనుభవించాలని చూస్తున్న విక్రమ్ కు రేపు బాక్స్ ఆఫీస్ వద్ద తన సినిమా మిస్టర్ కేకే అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. చాలా ఏళ్ళ క్రితమే సక్సెస్ కు దూరంగా ఉన్న విక్రమ్ దీని మీద మాత్రం గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు