Begin typing your search above and press return to search.
తండ్రి మార్క్ చూపించగలడా?
By: Tupaki Desk | 30 Sep 2019 8:54 AM GMTతమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం కాబోతున్న విషయం తెల్సిందే. అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసి ధృవ్ ను పరిచయం చేయాలని విక్రమ్ భావించాడు. బాలా దర్శకత్వంలో మొదట చిత్రీకరణ చేశారు. టీజర్ కూడా విడుదల చేసిన తర్వాత సినిమా బాగా రాలేదని మొత్తం రీ షూట్ కు నిర్ణయించుకున్నారు. అర్జున్ రెడ్డి చిత్రంకు సహాయ దర్శకుడిగా వ్యవహరించిన గిరీశయ్య ఆధిత్య వర్మకు దర్శకత్వం వహించాడు. నవంబర్ లో ఆధిత్య వర్మ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్బంగా ధృవ్ మాట్లాడుతూ.. నేను నటుడిగా పరిచయం అవ్వడానికి ముందు విదేశాల్లో శిక్షణ తీసుకున్నాడు. ఆ సమయంలో నాన్న ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతి రోజు ఏం నేర్చుకున్నావు.. ఎలా ఉంది శిక్షణ అంటూ అడిగేవాడు. నాన్న నటించిన ఎన్నో సినిమాలను చూసి ఆయన నటన నుండి ఇన్సిపిరేషన్ గా తీసుకుని నటన నేర్చుకున్నాను. ఆయన తరహాలోనే నటించాలని నేను అనుకుంటానంటూ ధృవ్ చెప్పుకొచ్చాడు.
ఆధిత్య వర్మ చిత్రంలో ధృవ్ నటనలో విక్రమ్ ను చూస్తారంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ట్రైలర్ తో ఇప్పటికే తన నటన చూపించిన ధృవ్ సినిమాలో కూడా తప్పకుండా ఆకట్టుకుంటాడనే నమ్మకం వ్యక్తం అవుతుంది. మంచి డేట్ కోసం ఎదురు చూస్తున్న ఆధిత్య వర్మ నవంబర్ లో రంగంలోకి దిగబోతున్నాడు. ఏ కుర్ర హీరో కూడా పరిచయం సమయంలో ఇంత టెన్షన్.. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఉండరు. ధృవ్ మొదటి సినిమాకే చాలా విషయాలను నేర్చుకున్నాడంటూ ఆధిత్య వర్మ చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు.