Begin typing your search above and press return to search.
మిలియన్ డాలర్స్ ఈసారి పాజిబులే
By: Tupaki Desk | 11 Dec 2016 6:43 AM GMTఓవర్సీస్ లో రామ్ చరణ్ సినిమాలు వీక్ గా పెర్ఫామ్ చేస్తాయనే సంగతి తెలిసిందే. అందుకే ఈ సారి ఏ మాత్రం ఛాన్స్ తీసుకోకూడదనే ఉద్దేశ్యంతో.. చరణ్ అండ్ టీం మూడు రోజుల పాటు యూఎస్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ మార్కెట్ ఎలాగూ స్ట్రాంగ్ కాబట్టి.. ఓవర్సీస్ పై దృష్టి పెట్టారు. కానీ గత సినిమాల ప్రభావంతో ప్రీమియర్స్ భారీగా వేసినా.. 2.23 లక్షల డాలర్లు మాత్రమే ప్రీమియర్స్ రూపంలో వచ్చాయి. ఇది ఫ్లాప్ మూవీ బ్రూస్ లీ కంటే తక్కువే.
అయితే.. రిలీజ్ రోజుకు వచ్చేసరికి సీన్ మారిపోయింది. శుక్రవారం రోజున ఓవర్సీస్ కలెక్షన్స్ 2.37 లక్షల డాలర్లు వచ్చాయి. దీంతో ధృవ ఓవర్సీస్ వసూళ్ల మొత్తం 4.60లక్షల డాలర్లకు చేరిపోయింది. అక్కడ మార్కెట్ ప్రకారం టాక్ బాగున్న సినిమాలకు శని, ఆది వారాలు వసూళ్లు బాగా పెరుగుతాయి. కనీసం శుక్రవారం వసూళ్లు నిలబడ్డా సరే.. వీకెండ్ ముగిసేసరికే.. ధృవ మిలియన్ డాలర్ వసూళ్లకు చేరువ అయిపోతుంది.
ఇదంతా కేవలం ధృవకు వచ్చిన సూపర్బ్ మౌత్ టాక్ అండ్ రివ్యూస్ మహత్యమే. టాలీవుడ్ లో ఇలాంటి థ్రిల్లర్ రాలేదనే టాక్.. సినిమా వసూళ్లకు బాగా ప్లస్ అవుతోంది. లోకల్ మార్కెట్ లో కూడా మొదటి రోజు కంటే శనివారం వసూళ్లు ఎక్కువగా ఉంటాయని ట్రేడ్ జనాలు అంచనా వేస్తున్నారు. టఫ్ టైమ్ లో ధృవను ఆదుకుంటున్నది స్ట్రాంగ్ కంటెంట్ అనే సంగతి ఒప్పుకోవాల్సిందే.