Begin typing your search above and press return to search.

ఫస్ట్ డే కలెక్షన్స్ లో ధృవ ఎక్కడో?

By:  Tupaki Desk   |   9 Dec 2016 7:40 AM GMT
ఫస్ట్ డే కలెక్షన్స్ లో ధృవ ఎక్కడో?
X
రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ ముందు పెద్ద టార్గెట్సే ఉన్నాయని ఇప్పటికే చెప్పేసుకున్నాం. థియేట్రికల్ వసూళ్ల రూపంలో మినిమం 60కోట్లు వసూలు చేస్తేనే ధృవ సేఫ్ జోన్ లోకి వస్తాడు. దీన్ని అందుకోవాలంటే మొదటి రోజు కలెక్షన్స్ చాలాముఖ్యం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ధృవ ఏ రేంజ్ వరకూ చేరుకుంటాడనే ఆసక్తి అందరిలోను కనిపిస్తోంది.

ఇప్పటివరకూ 22.4కోట్ల తొలి రోజు వసూళ్లతో బాహుబలి ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. సర్దార్ గబ్బర్ సింగ్ కు 20.92 కోట్లు.. జనతా గ్యారేజ్ కు 20.49 కోట్ల వసూళ్లు దక్కాయి. నాలుగో స్థానంలో శ్రీమంతుడు 14.72 కోట్లు రాగా. 13.06 కోట్లతో బ్రహ్మోత్సవం ఐదో స్థానంలో ఉంది. ఈ లిస్ట్ లో రామ్ చరణ్ ఆఖరి మూవీ బ్రూస్ లీ 12.66 కోట్లతో ఆరో స్థానంలో నిలిచింది. 10 స్థానంలో అయితే ఆగడు మూవీకి 9.74 కోట్లు దక్కాయి. ఇప్పుడున్న పరిస్థితిలో ధృవకు ఉన్న బజ్ కారణంగా... మెగా పవర్ స్టార్ కు కనీసం నాలుగో ప్లేస్ లోకి వచ్చేయడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు ట్రేడ్ జనాలు.

అంటే టాప్5లోకి ఎంట్రీ ఇచ్చేయడం తేలికే కానీ.. అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కడమే కొంచెం రిస్క్ లా ఉండొచ్చు. ఇప్పుడున్న డీమానిటైజేషన్ ను కూడా ఇందుకు కారణంగా చూపిస్తుండడం.. మిడ్ నైట్ షోలు లేకపోవడం కొంతమేర వసూళ్లపై ఎఫెక్ట్ చూపించచ్చని అంచనా. అయితే.. ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే.. టాప్ టు.. టాప్ త్రీ ప్లేస్ లలో ధృవ నిలిచినా ఆశ్చర్యం లేదన్నది ఇండస్ట్రీ టాక్. మరి ఏ సంగతి తెలియాలంటే మాత్రం.. శనివారం వరకూ ఆగాల్సిందే.