Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: ధృవ కెపాసిటీ తెలుస్తోంది
By: Tupaki Desk | 11 Oct 2016 11:33 AM GMTఈసారి చాలా గ్యాప్ తీసుకుని రీమేక్ కథతో ముందుకొస్తున్నాడు మెగా పవర్ స్టార్. తమిళంలో సూపర్ హిట్ అయిన ''తని ఒరువన్'' కతను ఎంచుకున్నప్పటికంటే.. ఆ సినిమాకు స్టయిలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డిని లైన్లో పెట్టినప్పుడు ఇంకా హైప్ పెరిగింది. పైగా గీతా ఆర్ట్స్ వారే ప్రొడ్యూసర్ కాబ్టటి.. ఖచ్చితంగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయ్. ఈరోజు సాయంత్రం విడుదలైన టీజర్ ఎలా ఉందో తెలుసా?
''నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే.. నీ క్యారెక్టర్ తెలుస్తుంది. అదే నీ శత్రువు ఎవరో తెలిస్తే.. నీ కెపాసిటీ తెలుస్తుంది'' అనే థీమ్ తో రూపొందిన సినిమా ''ధృవ''. రామ్ చరణ్ స్టయిలిష్ వాయిస్ ను ఈసారి ఇంకా మౌల్డ్ చేశాడు. అయితే సినిమా టీజర్లో విజువల్స్ బాగా డామినేట్ చేసేశాయి. తమిళంలో సినిమా హిట్టే కాని.. స్టయిలిష్ లుక్ లేదు. కాని తెలుగులో మాత్రం ఆ లోటును తీర్చేస్తున్నారు. ముఖ్యంగా చరణ్ కూడా క్లీన్ షేవ్ చేసి.. హ్యాండిల్ బార్ మీసం పెట్టేసి.. చాలా స్టయిలిష్ గా ఉన్నాడు. అన్నింటకంటే ముఖ్యంగా డెనిమ్ కాస్ట్యూమ్స్ లో లుక్స్ అదిరిపోయాయ్.
ఇకపోతే హిప్ హాప్ తమిళ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. అలాగే పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రాఫీ కూడా సూపరుంది. తన శత్రువును ఎంచుకున్నానని చెబుతున్న చరణ్.. డిసెంబర్ లో వచ్చేస్తున్నాడట. గెట్ రెడీ!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/