Begin typing your search above and press return to search.
మొదటి వీక్ లో 'ధృవ' అదరగొట్టాడే
By: Tupaki Desk | 17 Dec 2016 7:14 AM GMTరామ్ చరణ్ మూవీ ధృవ సూపర్బ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండో వారంలోకి ఎంటర్ అయిన ధృవ.. సెకండ్ వీకెండ్ లో కూడా కలెక్షన్స్ కుమ్మేస్తోంది. మొదటి రోజు కలెక్షన్స్ చూసి కంగారు పడ్డ ఇండస్ట్రీ జనాలు.. మొదటివారం వసూళ్లు చూసి షాక్ తినేస్తున్నారు.
మెగా పవర్ స్టార్ మూవీకి తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా 41.2 కోట్ల రూపాయల 'షేర్' వసూళ్లు దక్కాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 29.51 కోట్ల కలెక్షన్స్ రాబట్టగలిగాడు ధృవ. ఓవర్సీస్ లో ఇప్పటికే 1 మిలియన్ దాటేయడంతో.. ఫుల్ రన్ 1.5మిలియన్ దాటితే మరింతగా ఈ వసూళ్ల సంఖ్య పెరుగుతుంది. మొత్తంగా ఇప్పటివరకూ టాలీవుడ్ టాప్ కలెక్షన్స్ లిస్ట్ చూస్తే.. ఏపీ ప్లస్ నైజాం ఏరియాల వసూళ్లలో 8వ స్థానంలో నిలిచాడు ధృవ. ప్రపంచవ్యాప్తంగా ఓ తెలుగు సినిమా రాబట్టిన మొదటి వారం కలెక్షన్స్ లిస్ట్ లో కూడా ధృవ పేరు 8వ ప్లేస్ లోనే నిలిచింది.
లోకల్ గా డీమానిటైజేషన్.. ఓవర్సీస్ లో హెవీ స్నో ఫాల్ కారణంగా మైనస్ డిగ్రీల్లో టెంపరేచర్.. ఇలాంటి సిట్యుయేషన్స్ లో ధృవ ఈ రేంజ్ వసూళ్లు సాధించడాన్ని గుర్తుంచుకోవాలి. అయితే.. ఇప్పటికీ కలెక్షన్స్ స్టడీగా ఉండడం.. వీక్ డేస్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుండడం.. రెండో వీకెండ్ లో సత్తా చాటుతుండడం.. మరో వారం పది రోజులపాటు బాక్సాఫీస్ ని కుమ్మేసే అవకాశాలు ఉండడంతో.. ధృవ తన పంపిణీదారులందరినీ గట్టెక్కిస్తాడని అంటున్నారు. మొత్తంగా 60 కోట్లు షుమారు వసూలు చేయాల్సి ఉంది. మరి సెకండ్ వీకెండ్ లో ఏ మేరకు సత్తా చాటతాడనే విషయం తెలియాలంటే.. ఇంకో వారం ఆగాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/