Begin typing your search above and press return to search.

3 మిలియన్ వ్యూయర్లతో జాగ్రత్త 'ధృవ'

By:  Tupaki Desk   |   17 Oct 2016 9:30 AM GMT
3 మిలియన్ వ్యూయర్లతో జాగ్రత్త ధృవ
X
కేవలం టీజర్ రిలీజైన వారం రోజుల్లోనే రామ్ చరణ్‌ లేటెస్ట్ మూవీ ''ధృవ'' వీడియో.. యుట్యూబ్ లో ఏకంగా 3 మిలియన్ వ్యూయర్లను ఆకర్షించింది. అంటే ఇన్నాళ్ళూ ధృవ టీమ్ వెయిట్ చేసిన ఆ సూపర్ హైప్ మూమెంట్ వచ్చేసిందనమాట. జనాలు ఈ సినిమా కోసం ఎంత తీక్షణంగా వెయిట్ చేస్తున్నారో ఆ హిట్స్ చూస్తే చెప్పొచ్చు. కాని ఈ రేంజు హైప్ కూడా ప్రమాదమేనండోయ్. మెగా పవర్ స్టార్ అదే గ్రహించాలి.

సంవత్సరానికి ఒకసారి ఒక సినిమాతో వస్తున్నాడు ఈ మెగా వారసుడు. అయితే అలా రావడం వలన.. ఖచ్చితంగా ఏ సినిమాకైనా కూడా భారీగానే హైప్ ఉంటుంది. అలాగే ఆడియో రిలీజ్ అయ్యాక ఆ హైప్ ఇంకా పెరిగిపోతోంది. బ్రూస్ లీ సినిమా విషయంలో అదే జరిగింది. మెగా మీటర్ అండ్ రారా బ్రూస్ లీ అనే పాటలు పిచ్చ హిట్టయిపోవడం.. అలాగే డ్యాన్స్ టీజర్లు ఊరించేయడంతో సినిమా మీద ఓ రేంజు అంచనాలకు వచ్చేశారు జనాలు. చివరకు ఏమైంది? శ్రీను వైట్ల ఆ అంచనాలను రీచ్ అవ్వలేదు. సినిమా ఢమాల్ అనేసింది.

అయితే అలాంటి అంచనాలను ఈ మధ్యకాలంలో రాజమౌళి అండ్ కొరటాల శివ తప్పించి వేరే దర్శకులు ఎవరూ సరిగ్గా రీచ్ అవ్వలేకపోయారు. అందుకే ఇప్పుడు చరణ్‌ ''ధృవ'' టీమ్ కూడా జాగ్రత్తగా ఉండాలి మరి. దర్శకుడు సురేందర్ రెడ్డి ఇలా టీజర్లతో ఎక్కువ ఇంప్రెస్ చేసేసి.. తరువాత సినిమాలో అందుకు ఏమాత్రం తగ్గినా కూడా.. చరణ్‌ కు దెబ్బడిపోతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/