Begin typing your search above and press return to search.
‘ధృవ’ భలే లక్కీ బాస్
By: Tupaki Desk | 26 Dec 2016 11:30 AM GMTఈ మధ్య కాలంలో ‘ధృవ’ సినిమాకు కలిసొచ్చినట్లుగా మరే పెద్ద సినిమాకూ కలిసొచ్చి ఉండదేమో. డీమానిటైజేషన్ తో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తిన సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేయడంపై తర్జన భర్జన పడ్డారు నిర్మాత అల్లు అరవింద్. చివరికి డిసెంబరు 2 నుంచి 9కి వాయిదా వేసి.. ‘సింగం-3’తో తర్వాతి వారం కూడా పోటీ లేకుండా చేసి.. పక్కాగా గ్రౌండ్ ప్రిపేర్ చేసి సినిమాను రిలీజ్ చేశాడు. ‘సింగం-3’ స్థానంలోకి తర్వాతి వారం వచ్చిన రెండు చిన్న సినిమాలూ ప్రభావం చూపించలేకపోవడంతో ‘ధృవ’కు ప్లస్ అయింది. ఆ తర్వాతి వీకెండ్లో ఒకటికి ఐదు సినిమాలు రిలీజయ్యాయి కానీ.. అందులో ఒక్క ‘దంగల్’ తప్ప అన్ని సినిమాలకూ నెగెటివ్ టాకే వచ్చింది.
‘దంగల్’ ఎంతైనా డబ్బింగ్ సినిమా.. ప్రచారం కూడా తక్కువే కాబట్టి ‘ధృవ’ను పెద్దగా దెబ్బ తీయలేదు. సెకండ్ వీకెండ్ అయ్యాక డల్ అయిన ‘ధృవ’ వీకెండ్లో కొత్త సినిమాల సంగతేంటో తేలిపోయాక మళ్లీ పుంజుకుంది. శని.. ఆదివారాల్లో మంచి వసూళ్లే సాధించింది. ‘వంగవీటి’కి దీటుగా కలెక్షన్లు రాబట్టింది. కొన్ని చోట్ల హౌస్ ఫుల్స్ కూడా పడటం విశేషం. మొత్తంగా మూడో వారాంతంలో కూడా చెప్పుకోదగ్గ వసూళ్లతో బాగానే ప్రభావం చూపించింది ‘ధృవ’. యుఎస్ లో 1.3 మిలియన్ మార్కును టచ్ చేయడం కష్టమే అనుకుంటే.. ఆ మార్కును దాటి 1.5 మిలియన్ క్లబ్బు మీద కూడా ఆశలు రేపుతోంది ‘ధృవ’. ఇప్పటిదాకా ఈ చిత్రం 1.35 డాలర్ల దాకా వసూలు చేసింది. మొత్తానికి ‘ధృవ’కు మొదట్లో వచ్చిన టాక్.. ఆరంభ వసూళ్లు చూస్తే.. బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో నిలిచిపోతుందనే అనుకున్నారు. కానీ ఇప్పుడు స్వల్ప నష్టాలతో బయ్యర్లను బయటపడేసేలా కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఈ చిత్రం రూ.54 కోట్ల దాకా వరల్డ్ వైడ్ షేర్ సాధించినట్లు అంచనా. రూ.60 కోట్ల షేర్ రాబడితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించినట్లు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/