Begin typing your search above and press return to search.
ధృవ ఫస్ట్ డే: డిమానిటైజేషన్ పంచ్ పడింది
By: Tupaki Desk | 10 Dec 2016 9:27 AM GMTరికార్డులు సంగతి సరే.. అసలు డీమానిటైజేషన్ దెబ్బ పెద్ద సినిమాలకు తగలనుందా? లేదా? అని విషయం గమనించాలంటే మాత్రం అందరూ ''ధృవ'' రిజల్టు మీదనే ఆధారపడాలి. చూస్తుంటే ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చిన.. రామ్ చరణ్ తిరుగులేని మెగాభిమానుల అండ ఉన్నా కూడా.. కరెన్సీ దెబ్బ కాస్త గాట్టిగానే తగిలింది.
ఇప్పటివరకు అందుతున్న ట్రేడ్ పండితుల ఇన్పుట్స్ ప్రకారం.. తొలిరోజు ''ధృవ'' సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలలో 10.55 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. నైజాం అండ్ వైజాగ్ వంటి ఏరియాల్లో ఈ డిమానిటైజేషన్ ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ.. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఏరియాల్లో.. ఇంకా ఆన్ లైన్ టిక్కెట్ల హవా పెద్దగా లేని చోట.. డీమానిటైజేషన్ ప్రభావం బాగానే కనిపించింది. కేవలం ఫ్లాపు టాక్ తో నే బ్రూస్ లీ సినిమా ఈస్ట్ లో తొలిరోజు 1.32 కోట్లు.. వెస్ట్ లో 1.33 కోట్లు వసూలు చేస్తే.. ఇప్పుడు హిట్ టాక్ ఉన్నప్పటికీ ''ధృవ'' మాత్రం అక్కడ 85 లక్షల నుండి 90 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అందుకే ఫ్లాపు టాక్ తో ''బ్రూస్ లీ'' సినిమా 12.66 కోట్లు షేర్ వసూలు చేయగలిగితే.. ''ధృవ'' మాత్రం కేవలం 10.5+ కోట్ల షేర్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
సురేందర్ రెడ్డి డైరక్షన్లో రూపొందిన ''ధృవ'' సినిమాకు యునానిమస్ గా క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ జై కొట్టేశారు. ఒక అద్భుతమైన థ్రిల్లర్ అంటూ కితాబిచ్చేశారు. పైగా తమిళ వర్షన్ కంటే తెలుగు వర్షన్ మరింత స్టయిలిష్ గా ఉందంటూ పొగిడేస్తున్నారు. మరి ఫుల్ రన్ లో ధృవ ఏ రేంజులో లాక్కొస్తాడో చూడాలి. దాదాపు 60 కోట్లు వసూలు చేస్తే కాని బయ్యర్లందరూ సేఫ్ అవ్వరనే విషయం తెలిసిందే.