Begin typing your search above and press return to search.
ధృవ.. లెక్కలు మారిపోయాయ్ గురూ
By: Tupaki Desk | 7 Jan 2017 10:30 PM GMTరామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ.. అన్ సీజన్ లో రిలీజ్ అయి కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ లో విడుదలై 50 కోట్లకు మించి షేర్ వసూలు చేసిన తొలి చిత్రంగా రికార్డ్ నమోదు చేసింది. అటు ఓవర్సీస్ లో చాలా కాలంగా మెగా పవర్ స్టార్ ఊరిస్తున్న మిలియన్ డాలర్ మార్క్ ను ఈజీగా క్రాస్ చేసేసింది ధృవ.
ఇప్పుడీ చిత్రం ఐదోవారంలోకి ఎంటర్ అయింది. అమెరికాలో చాలా ఏరియాల్లో మళ్లీ ధృవను తిరిగి ప్రదర్శిస్తున్నారు. గతవారంలో 25 స్క్రీన్స్ జత కాగా.. ఈ వారం మరిన్ని పెరిగాయి. హాలీవుడ్ క్రిస్మస్ మూవీస్ కోసం ధృవను తీసేసిన చాలా చోట్ల.. ఇప్పుడు మళ్లీ చెర్రీ మూవీని ప్రదర్శిస్తున్నారు. ఒక మూవీని ఐదోవారంలో తిరిగి రీఓపెన్ చేయడం అంటే.. అక్కడ ఎంతగా ఈ చిత్రానికి డిమాండ్ ఉందో అర్ధమవుతుంది. ఓవర్సీస్ లో ధృవ సూపర్ సక్సెస్ సాధించిందని చెప్పడానికి ఇదే నిదర్శనం. దీంతో పాటు.. ఇప్పటివరకూ ధృవ ఓవర్సీస్ లో వసూలు చేసిన మొత్తం ఎంతో తెలుసా? 1.55 మిలియన్ డాలర్లు.
1.3 మిలియన్ డాలర్ల దగ్గర ధృవ ఓవర్సీస్ బిజినెస్ క్లోజ్ అవుతుందని అంచనా వేస్తే.. ఇప్పుడు 1.5 మిలియన్ మార్క్ ను దాటేసి పరుగులు పెడుతోంది. ఈ వీకెండ్ కలెక్షన్స్ కలుపుకుని.. మరింతగా రాబట్టే ఛాన్సులు ఉన్నాయి. ఓవర్సీస్ లో షేర్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం 1.5 మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ వస్తే ప్రొడ్యూసర్ షేర్ మరింతగా పెరుగుతుంది. కాబట్టి.. ఓవర్సీస్ నుంచి చెర్రీ మూవీ వచ్చే షేర్ పెరగనుందన్న మాట. ఈ వారం గడిచి.. సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయ్యాక.. ధృవ ఫుల్ రన్ లో ఎంత వసూలు చేశాడో తేలిపోనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/