Begin typing your search above and press return to search.
బ్రూస్ లీ కంటే ధృవకు తక్కువ?
By: Tupaki Desk | 9 Dec 2016 4:30 PM GMT‘ధృవ’ సినిమా మీద విడుదలకు ముందు పాజిటివ్ బజ్ ఉంది అయినప్పటికీ యుఎస్ ప్రిమియర్స్ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు. ముందు రోజు అడ్వాన్స్ బుకింగ్సే డల్లుగా ఉండగా.. ఓవరాల్ కలెక్షన్లు కూడా ఆశాజనకంగా లేవు. ప్రిమియర్స్ ద్వారా ఈ సినిమా 2.23 లక్షల డాలర్లు వసూలు చేసింది. డిజాస్టర్ అయిన చరణ్ లాస్ట్ మూవీ ‘బ్రూస్ లీ’కి 2.85 లక్షల డాలర్లు ప్రిమియర్ల ద్వారా వసూలవడం విశేషం. ‘ధృవ’ యుఎస్ ప్రిమియర్ల కోసం ప్రమోషన్ బాగా చేసినా.. రామ్ చరణ్ సహా యూనిట్ అంతా ప్రిమియర్స్ కు హాజరైనా కలెక్షన్లు ఇలా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఐతే ‘ధృవ’ ప్రిమియర్స్ కలెక్షన్లు చూసి మెగా అభిమానులు మరీ కంగారు పడిపోవాల్సిన పని లేదు. రీమేక్ కావడం వల్ల అక్కడి జనాల్లో ఎగ్జైట్మెంట్ తక్కువగా ఉండొచ్చు. పైగా రామ్ చరణ్ యుస్ మార్కెట్ కొంచెం వీకే. అందుకు అతను ఇంతకుముందు చేసిన రొటీన్ మాస్ మసాలా సినిమాలే కారణం. ఐతే ‘ధృవ’కు టాక్ పాజిటివ్ గా ఉండటం పైగా సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.. ఈ తరహా థ్రిల్లర్లు యుఎస్ ఆడియన్స్ కు బాగా నచ్చే అవకాశం ఉండటంతో కలెక్షన్లు పుంజుకోవచ్చు. స్టడీగానూ ఉండొచ్చు. కాబట్టి చరణ్ కెరీర్లో ఫస్ట్ మిలియన్ డాలర్ మూవీగా ‘ధృవ రికార్డు నెలకొల్పే అవకాశాలు బాగానే ఉన్నాయి. ఐతే ఈ సినిమా లాభాలు పంచాలంటే మాత్రం 1.5 మిలియన్ డాలర్ల మార్కును అందుకోవాలి. అది మాత్రం అంత సులువు కాకపోవచ్చు.