Begin typing your search above and press return to search.

23 రోజుల్లో 18 కేజీలు త‌గ్గిన హీరో

By:  Tupaki Desk   |   17 Jan 2023 8:52 AM GMT
23 రోజుల్లో 18 కేజీలు త‌గ్గిన హీరో
X
యాక్ష‌న్ కింగ్ అర్జున్ స‌ర్జా కుటుంబం నుంచి వ‌చ్చిన యువ‌హీరో ధృవ స‌ర్జా. నిజానికి అర్జున్ తాత గారు శక్తి కాంత్ నాటి రోజుల్లో ప్ర‌ముఖ హీరో. స‌ర్జా వంశం నుంచి ఈ వార‌స‌త్వం సినీరంగంలో కొన‌సాగుతోంది. అయితే యాక్ష‌న్ కింగ్ అర్జున్ త‌ర్వాత మ‌ళ్లీ ఆ రేంజు ఎవ‌రిలోను క‌నిపించ‌లేదు.

కానీ యువ‌న‌టుడు అర్జున్ స‌ర్జా క‌న్న‌డ‌లో బిజీ స్టార్ గా కెరీర్ ని మ‌లుచుకుంటున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా రేస్ లోకి వ‌చ్చాడు. అత‌డు న‌టించిన కేడీ - ది డెవిల్ బ‌హుభాషా చిత్రంగా తెర‌కెక్కుతోంది.

యాక్ష‌న్ కింగ్ అర్జున్ లా ఇటు తెలుగు-త‌మిళంలో టాప్ స్టార్ కాలేక‌పోయినా కానీ అత‌డు కెరీర్ బండిని నెమ్మ‌దిగా ముందుకు న‌డిపిస్తున్నాడు. ఇక‌పోతే ఇటీవ‌లి కాలంలో అతడు అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నాడు. కానీ దీనిని అత‌డు ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు.

కేవలం 23 రోజుల్లో కేడీ అనే సినిమా కోసం దాదాపు 18 కిలోలు తగ్గి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ధృవ స‌ర్జా తన డైటీషియన్ నుండి కఠినమైన ఆహార నియ‌మాల‌ను సూచనలను తెలుసుకుని తూ.చ త‌ప్ప‌క‌ అనుసరించాడు. క‌ఠోర త‌ప‌న‌తో అత‌డి రూపం అమాంతం మారింది. చిత్ర దర్శకుడు ప్రేమ్ ఈ మేకోవ‌ర్ ని ప్ర‌శంసించ‌కుండా ఆగ‌లేక‌పోయారు.

ధృవ సర్జా 23 రోజుల్లో 18 కేజీల బరువు తగ్గించి కేడీ (వార్ డ్రామా) అనే యుద్ధ‌భూమిలోకి అడుగుపెట్టబోతున్నాడు. హీరోని ఎలివేట్ చేసేందుకు యుద్ధం సిద్ధమైంది! అనే సందేశాన్ని మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్రెజెంట్ చేసారు. టైటిల్ టీజర్ ఇటీవ‌ల‌ ఇంటర్నెట్ లో తుఫాన్ గా మారింది.

ధృవ సర్జా శక్తివంతమైన ప్రదర్శనతో దూసుకొస్తున్నాడ‌ని టీజ‌ర్ చెబుతోంది. టీజర్ లో అర్జున్ స‌ర్జా ఎంట్రీ అందుకు నిదర్శనంగా మారింది. కేడీ-ది డెవిల్ ని కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కన్నడం- తమిళం- తెలుగు- మలయాళం- హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.