Begin typing your search above and press return to search.
2 రోజులు.. 3 మిలియన్ వ్యూస్.. అదీ లెక్క
By: Tupaki Desk | 28 Nov 2016 4:44 AM GMT2 రోజులు.. 3.3 మిలియన్ వ్యూస్.. 59వేల లైక్స్.. టాలీవుడ్ చరిత్రలో 'ట్రైలర్ల' విషయానికొస్తే ఇదో అద్భుతమైన రికార్డు. ఈ ఫీట్ ను సాధించింది మరో సినిమాయేదీ కాదు.. రామ్ చరణ్ ''ధృవ'' ఆ రేంజులో దూసుకుపోతోంది. నవంబర్ 25 సాయంత్రం విడుదలైన ఈ ట్రైలర్.. సోమవారం ఉదయం నాటికి.. 35 లక్షల హిట్స్ తెచ్చుకుని.. ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
ఈ సందర్భంగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఏమంటున్నాడంటే.. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ షర్టు లేకుండా బాడీ చూపిస్తున్న విజువల్స్ వంటివి బాగా క్లిక్ అయ్యాయ్ అంటున్నాడు. ''ఒరిజినల్ సినిమాలో కథ పరంగా చాలా మార్పులు చేశాక.. విజువల్ గా అసలు ఆ సినిమాకు సంబంధం లేకుండా తీయాలనేదే నా ప్లాన్. అందుకే చాలా కొత్త స్టయిల్లో ధృవను ఫినిష్ చేశాం. నేను అనుకున్నా ఆ లాజిక్ బాగా వర్కవుటయింది. చరణ్ కొత్తగా కనిపించడమే కాదు.. ధృవ ట్రైలర్లో ఉన్న ఆ న్యూ స్టయిల్ విజువల్స్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అనడానికి.. ఈ 3 మిలియన్ వ్యూస్ నిదర్శనం'' అన్నాడు సూరి.
సర్లేండి.. ఇక్కడే ఒక మ్యాటర్ తెలుసుకోవాలి మనం. ''బాహుబలి'' ట్రలైర్ కు లైఫ్ టైమ్ లో 39వేల లైక్స్ వచ్చాయి. జనతా గ్యారేజ్ ట్రైలర్ కు 60,130+ లైక్స్ వచ్చాయ్. ఇక దృవ వీటిని క్రాస్ చేస్తూ 60,650+ లైక్స్ ను తెచ్చుకుంది. కాని ఈ సినిమాలన్నింటికంటే.. బాహుబలికే కలక్షన్ల విషయంలో 600 కోట్ల చరిత్ర ఉంది సుమీ. ట్రైలర్ల మీద ప్రేక్షకులు చూపించే అభిమానాన్ని ధియేటర్లలో బ్లాక్ బస్టర్ గా ఎంతవరకు మలుచుకుంటారనేదే అసలు ఛాలెంజ్!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/