Begin typing your search above and press return to search.

ధృవ.. వాళ్లకి కాస్త గ్యాప్ ఇవ్వవయ్యా!!

By:  Tupaki Desk   |   11 Nov 2016 7:30 AM GMT
ధృవ.. వాళ్లకి కాస్త గ్యాప్ ఇవ్వవయ్యా!!
X
ధృవ ఆడియో సాంగ్స్.. మార్కెట్లో రచ్చ రచ్చ చేసేస్తున్నాయి. రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే ఛార్ట్ బస్టర్స్ కూడా అయిపోయాయి. మరోవైపు.. ఆడియో ఫంక్షన్ చేయకుండానే.. ధృవ పాటలను మార్కెట్లోకి వదలడంతో.. ప్రమోషన్స్ విషయంలో గ్యాప్ రాకుండా ఉండేందుకు.. నెల ముందు నుంచే టీవీల్లో ప్రకటనలు గుప్పించేస్తున్నారు.

'నీతోనే డ్యాన్స్'.. 'చూశా చూశా' అనే పాటలతో టీవీ ఛానల్స్ లో ప్రతీ బ్రేక్ లోనూ రచ్చ చేస్తున్నారు ధృవ టీమ్. ఆడియో రిలీజ్ అయ్యిందని చెప్పడానికే ఈ గ్రాండ్ ప్రమోషన్స్ అన్నీ. అయితే.. ఇప్పుడు నాగ చైతన్య-మంజిమా మోహన్ నటించగా.. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో రూపొందిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రం ఇవాళే రిలీజ్ ఉంది. దీంతో పాటు వచ్చే వారం థియేటర్లలోకి వచ్చేందుకు అల్లరి నరేష్ మూవీ.. ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం కూడా.. సినిమాల ప్రమోషన్లు కూడా చాలా ఎగ్రెసివ్ గానే సాగుతున్నాయి.

వీటిలో ఒకటి థియేటర్లలో ఉన్న సినిమా. మరొకటి రిలీజ్ కానున్న మూవీ. ఈ రెండు సినిమాల కంటే.. వాటితో పాటు ధృవ సందడే ఎక్కువగా కనిపిస్తోంది. కేవలం 10 సెకన్ల ప్రోమోలు రెండు ఇచ్చి ప్రచారం చేస్తున్నాడు ధృవ. వచ్చే నెల రాబోయే చిత్రం ప్రచారం కంటే.. ఇప్పుడు ప్రేక్షకుల తీర్పు కోసం థియేటర్లలో ఉన్న ఇంపార్టెంట్ అనే సంగతి ఒప్పుకోవాల్సిందే. అందుకే ధృవ.. వాళ్లకి కాస్త గ్యాప్ ఇవ్వవయ్యా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/