Begin typing your search above and press return to search.

రూ. 200 కోట్లు రాబట్టిన సినిమాను చెత్త సినిమా అన్న దర్శకుడు

By:  Tupaki Desk   |   1 March 2019 10:56 AM GMT
రూ. 200 కోట్లు రాబట్టిన సినిమాను చెత్త సినిమా అన్న దర్శకుడు
X
ఈ ఏడాది బాలీవుడ్‌ లో ఇప్పటి వరకు రణ్‌ వీర్‌ సింగ్‌ నటించిన 'గల్లీ బాయ్‌' మరియు అజయ్‌ దేవగన్‌ నటించిన 'టోటల్‌ ఢమాల్‌' చిత్రాలు మాత్రమే ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా టోటల్‌ ఢమాల్‌ చిత్రం ఏకంగా 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లుగా ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. లాజిక్‌ లేని సీన్స్‌, పొంతన లేని క్యారెక్టర్స్‌ తో రూపొందిన కామెడీ చిత్రం 'టోటల్‌ ఢమాల్‌' కు బ్యాడ్‌ రివ్యూలు వచ్చాయి. అయినా కూడా ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాన్ని ఆధరిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం 200 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇంతగా వసూళ్లు చేసిన మూవీని దర్శకుడు ధులియా చెత్త సినిమా అంటూ విమర్శించడం ప్రస్తుతం బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

గతంలో పలు చిత్రాలను తెరకెక్కించిన ధులియా కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈయన తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఒకప్పటి సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేవి. కాని ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. ఏ ఒక్క సినిమా కూడా అన్ని వర్గాల వారిని మెప్పించలేక పోతున్నాయి. ఒక సినిమా ఒక వర్గం వారిని లేదా కొంత మందిని మాత్రమే ఆకట్టుకుంటున్నాయి. ప్రేక్షకుల మద్య అంతరాలు బాగా పెరిగి పోవడంతో, వారి సినీ అభిరుచి కూడా మారిందని ధులియా అన్నారు.

ఈమద్య కాలంలో 'టోటల్‌ ఢమాల్‌' సినిమా వచ్చింది. ఆ సినిమా ట్రైలర్‌ మొత్తం చెత్తే, సినిమా కూడా చెత్త సినిమా అని విన్నాను. అదేంటో ప్రేక్షకులు మాత్రం ఎగబడి మరీ ఆ సినిమాను చూస్తున్నారు. చెత్త సినిమా అయిన టోటల్‌ ఢమాల్‌ ఎలా 200 కోట్ల రూపాయలు వసూళ్లు చేసిందో అంటూ ధులియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి దర్శకుడి మాదిరిగానే నాకు కూడా విభిన్నమైన నేపథ్యంలో సినిమాలు తీయాలనే కోరిక ఉంది. కాని అలా తీస్తే ప్రేక్షకులు ఆధరించరేమో అనే భయంతో అంతా కూడా రొటీన్‌ సినిమాలనే తీస్తున్నారు. ఇప్పుడు సినిమా అంటే హీరో, హీరోయిన్‌, వారి స్నేహితులు, విలన్‌, వీరు తప్ప సినిమాలు ఎవరు ఉండటం లేదు. వారెవ్వరు కూడా లేకుండా సినిమా తీయాలని ఉంది. కాని ప్రేక్షకులు ఆధరించరేమో అనే భయంతో ఎవరు తీయడం లేదని ధులియా పేర్కొన్నారు.