Begin typing your search above and press return to search.

పెళ్లయిన ఏడు నెలలకు హనీమూన్‌

By:  Tupaki Desk   |   19 Aug 2015 3:34 PM GMT
పెళ్లయిన ఏడు నెలలకు హనీమూన్‌
X
బిజీ జీవితం, కమర్షియల్‌ లైఫ్‌ బంధాల్ని విడగొడుతోంది. కొత్తగా పెళ్లయిన జంట శోభనానికి, హనీమూన్‌ కి ఏళ్లకు ఏళ్లు ఎదురు చూడాల్సిన దుస్థితి. మోడ్రన్‌ లైఫ్‌ స్ట్రాటజీనే అలా ఉంది మరి. ఇలా పెళ్లి చేసుకుని అలా వ్యాపారాల్లో బిజీ అయిపోయేవాళ్లెందరో. ఇదిగో హైదరాబాదీ అమ్మాయి దియామీర్జా పరిస్థితి కూడా అదే.

అప్పట్లో తను వలచిన బిజినెస్‌ మ్యాగ్నెట్‌ సాహిల్‌ సంఘాని పెళ్లాడేసింది ఈ హీరోయిన్‌ కం ప్రొడ్యూసర్‌. కానీ ఇలా పెళ్లయిందో లేదో అలా వ్యాపారాల్లో మునిగిపోయారిద్దరూ. ప్రస్తుతం ఈ కొత్త జంట సొంత బ్యానర్‌ లో ఓ సినిమాని నిర్మిస్తున్నారు. ఆ పనుల్లో పడిపోయి హనీమూన్‌ సంగతే మర్చిపోయారు. ఇన్నాళ్లకు ప్రొడక్షన్‌ పూర్తయి రిలీఫ్‌ దొరికింది. అందుకే వారం పాటు సెలవు తీసుకుని, హనీమూన్‌ కి టర్కీ వెళుతున్నారు. అక్కడ ఫుల్లుగా ఎంజాయ్‌ చేసి తిరిగి వస్తారు.

ప్చ్‌.. పాపం దియా. ఇంతకాలం వేచి చూడాల్సొచ్చిందన్నమాట. దియా మీర్జా సొంత బ్యానర్‌ బోర్న్‌ ఫ్రీ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ పతాకంపై సాహిల్‌ తో కలిసి సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉంటోంది ఎప్పుడూ.