Begin typing your search above and press return to search.

ఫ్యాష‌న్ వీక్‌ లో హైద‌రాబాదీ మెరుపు

By:  Tupaki Desk   |   26 Aug 2018 5:43 AM GMT
ఫ్యాష‌న్ వీక్‌ లో హైద‌రాబాదీ మెరుపు
X
ముంబై న‌గ‌రాన్ని లాక్మే ఫ్యాష‌న్ వీక్ హీటెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ్యాష‌న్ ప్ర‌పంచ‌పు రారాజు `ది సిటీ ఆఫ్ లైట్స్‌`గా ప్రాచుర్యం పొందిన ప్యారిస్‌కే ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించే రేంజులో ఇండియ‌న్ బ్యూటీస్ కొలువుదీరుతున్నారిక్క‌డ‌. కొన్ని హంస‌లు మానస స‌రోవ‌రం నుంచి దారి త‌ప్పి ఇటొచ్చాయా? అని యూత్ ఒక‌టే క‌న్ఫ్యూజ‌న్‌ లో ప‌డిపోయారు.

కొద్దిరోజులుగా ముంబై లాక్మే షో హ‌డావుడితో వేడెక్కిపోయింది. నిన్న‌టిరోజున ప‌లువురు అందాల క‌థానాయిక‌లు ర్యాంప్ వాక్‌ ల‌తో న‌గ‌రాన్ని ఊపేశారు. సుశ్మితాసేన్‌ - నేహా ధూపియా - మ‌లైకా అరోరా ఖాన్‌ లాంటి సీనియ‌ర్లు - శ్రుతిహాస‌న్ - దిశా ప‌టానీ - జాన్వీక‌పూర్ లాంటి అంద‌గ‌త్తెల‌తో ర్యాంప్ గ‌జ‌గ‌జ ఒణికింది. ఈ భామల ర్యాంప్ వాక్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. యంగ్ గాళ్‌ జాన్వీ షో స్టాప‌ర్‌ గా వెలిగిపోయింది.

ఇదేచోట హైద‌రాబాదీ మెరుపు దియా మీర్జా త‌ళుకుబెళుకులు ప్ర‌ద‌ర్శించ‌డం హాట్ టాపిక్ అయ్యింది. 40కి చేరువ‌వుతున్నా.. మిసెస్‌ దియా మీర్జా 20ప్ల‌స్ అమ్మాయిలా త‌ళుక్కున మెరిసింది. ఈ హైద‌రాబాదీ అందంలో మునుప‌టి మెరుపు ఇంకా త‌గ్గ‌లేద‌ని ఈ షో చూస్తే అర్థ‌మైంది. దియా ఇటీవ‌లే సంజ‌య్‌ ద‌త్ బ‌యోపిక్ `సంజు`లో కీల‌క పాత్ర పోషించింది. సంజ‌య్‌ ద‌త్ భార్యామ‌ణి మాన్య‌తా ద‌త్ పాత్ర‌లో జీవించింది. మునుముందు రాజ్‌కుమార్ హిరాణీ తెర‌కెక్కించ‌నున్న భారీ చిత్రాల్లోనూ దియా న‌టించ‌నుంది.

వీడియో కోసం క్లిక్ చేయండి