Begin typing your search above and press return to search.

'టక్ జగదీష్' కోసం శివ నిర్వాణ రాసిన ఎమోషనల్ డైలాగ్స్..!

By:  Tupaki Desk   |   2 Sep 2021 5:46 AM GMT
టక్ జగదీష్ కోసం శివ నిర్వాణ రాసిన ఎమోషనల్ డైలాగ్స్..!
X
నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన సినిమా ''టక్ జగదీష్''. ఇందులో నాని సరసన రీతూ వర్మ - ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం సినిమా ట్రైలర్‌ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఫ్యామిలీ - లవ్ - యాక్షన్‌ - భావోద్వేగ సన్నివేశాలతో నిండిపోయిన ''టక్ జగదీష్'' ట్రైలర్ ఆడియన్స్ ని విశేషంగా అలరిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో ఉమ్మడి కుటుంబంలోని అనుబంధాలు ఆప్యాయతలు.. వారి మధ్య వచ్చే గొడవలు.. ఊర్లో భూ తగాదాలు వంటి అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతున్నట్లుగా ఈ ట్రైలర్ ని బట్టి అర్ధమవుతోంది. అలానే డైరెక్టర్ శివ నిర్వాణ రాసిన కొన్ని ఎమోషనల్స్ డైలాగ్స్ హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి.

'చిన్నప్పుడు నాకో మాట చెప్పావ్‌ గుర్తుందా? నా కుటుంబం ఓడిపోతే నేను ఓడిపోయినట్టే' 'భూ కక్షలు లేని భూదేవిపురం చూడాలనేది మా నాన్న కోరిక.. ఇప్పుడది నా బాధ్యత' 'అయినోళ్ళ కంటే ఆస్తులు పొలాలు ఎక్కువ కాదు.. రక్తసంబంధం విలువ తెలుసుకో' 'ఆడ కూతురిని ఏడిపించిన ఏ వెధవ బాగుపడడు' 'కుల పిచ్చి డబ్బు పిచ్చి ఉన్నవాళ్ళని చూస్తాం.. ఈయనకి కుటుంబం పిచ్చి' వంటి డైలాగ్స్ ట్రైలర్‌ కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

'నిన్నుకోరి' 'మజిలీ' సినిమాల తరహాలోనే శివ నిర్వాణ ''టక్ జగదీష్'' చిత్రంలో కూడా స్ట్రాంగ్ ఎమోషన్స్ ని నమ్ముకున్నట్లు తెలుస్తోంది. అసలు భూదేవిపురం కథేంటి? టక్ జగదీష్ ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య వచ్చిన కలహాలేంటి? కుటుంబాన్ని పిచ్చిగా ప్రేమించే జగదీష్‌ నాయుడు అనుకున్నది సాధించాడా లేదా? అనేది తెలియాలంటే ఈ నెల 10వ తేదీ వరకు ఆగాల్సిందే.

''టక్ జగదీష్'' చిత్రంలో నాజర్‌ - జగపతిబాబు - నరేశ్‌ - రావు రమేశ్‌ - డేనియల్ బాలాజీ - ప్రియదర్శి - తిరువీర్ - రోహిణి - ప్రవీణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి - హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. గోపి సుందర్ నేపథ్య సంగీతం అందించారు. ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందించగా.. ప్ర‌వీణ్ పూడి ఎడిటర్ గా.. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.