Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: మేరా జూతా హై నియాని

By:  Tupaki Desk   |   4 May 2019 5:24 AM GMT
ఫోటో స్టొరీ: మేరా జూతా హై నియాని
X
ఫోటో స్టొరీ అనగానే అందాల విందు.. అంగాంగ వర్ణనలేనా? కాస్త స్టైల్.. కాస్త మోడరన్ ట్రెండ్స్ గురించి మాట్లాడుకోవద్దా? అందుకే ఈసారి డయానా పెంటీ గురించి మాట్లాడుకుందాం. ఇంతకీ ఈ డయానా పెంటీ ఎవరో తెలుసా? బాలీవుడ్ భామ. సైఫ్ అలీ ఖాన్.. దీపిక పదుకొనే ల చిత్రం 'కాక్ టైల్' ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'హ్యాపీ భాగ్ జాయేగి'.. 'లక్నో సెంట్రల్'.. 'పరమాణు: ది స్టొరీ ఆఫ్ పోఖ్రాన్' లాంటి సినిమాల్లో నటించింది. నటించిన సినిమాలు తక్కువే అయినా సోషల్ మీడియాలో మాత్రం హంగామా ఎక్కువే.

ఈ భామ స్పెషాలిటీ ఏంటంటే మోడలింగ్ రంగం నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ హాట్ పోజులు పెద్దగా ఇవ్వదు. మోడరన్ దుస్తులు.. డిజైనర్ కాస్ట్యూమ్స్ ధరిస్తుంది కానీ మితి మీరిన అందాల ప్రదర్శన చేసిన సందర్భాలు తక్కువే. అలా అని స్టైల్ విషయంలో ఏమాత్రం రాజీ పడదు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో డెనిమ్ జీన్స్ షర్టు.. ప్యాంట్ ధరించి నిలబడింది. తన రెగ్యులర్ స్టైల్ లోనే జేబుల్లో చేతులో పెట్టుకొని.. కాళ్ళు అటు ఇటూ క్రాస్ గా పెట్టుకొని కిందకు చూస్తూ ఉంది. షర్టు చివర ముడి వేయడంతో క్లాసుతో పాటు కాస్త మాసును కూడా రంగరించినట్టుగా అయింది.

అయితే ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ "మేరా జూతా హై నియాని". కళ్ళకు గాడీగా కనిపించే కలర్లను నియాన్ కలర్లు అంటారని తెలిసిందే. డయానా అదే చెప్తోంది. నా కాళ్ళకు ఉన్న నియాన్ కలర్ షూను చూడమని అంటోంది. కరెక్ట్ గా చెప్తే అది నియాన్ ఎల్లో కలర్. ఈ ఫోటోలో మొత్తానికి కొట్టొచ్చినట్టు కనిపించే విషయమే అది. నిజానికి.. డయానా కూడా అందుకే కాళ్ళకు వేసుకున్న బూట్లను మురిపెంగా చూసుకుంటూ ఉంది. దాదాపు చాలామంది ఈ షూ ట్రెండీగా ఉందని.. నీకు నప్పిందని తెలిపారు. ఒక నెటిజనుడు మాత్రం "కింద ఎలెక్ట్రికల్ సాకెట్లు IE రూల్స్ ప్రకారం లేవు" అన్నాడు. అంటే అందరూ బ్యూటీని.. ఆమె వేసుకున్న మెరిసే బూట్లను చూస్తుంటే ఆ గురుడు మాత్రం బూట్ల వెనక ఉన్న ప్లగ్గులను చూస్తున్నాడు!