Begin typing your search above and press return to search.

కేన్స్ లో కాపీ క్యాట్ ఎవ‌రు?

By:  Tupaki Desk   |   19 May 2019 5:35 AM GMT
కేన్స్ లో కాపీ క్యాట్ ఎవ‌రు?
X
వేడిగా వ‌డ్డిస్తేనే వంట‌కం కిక్కిస్తుంది. కాస్త చ‌ల్లారాక తిన‌డం క‌ష్టం. కానీ ఈ అమ్మ‌డు ఆ ప‌నే చేసింది. దీంతో అస‌లు ఏమాత్రం కిక్కు లేదు అంటూ బోయ్స్ నిరాశ‌ప‌డిపోవ‌డం హాట్ టాపిక్. ఇంత‌కీ ఈ స‌న్నివేశం ఎక్క‌డ‌? ఎందులో ఈ మిస్టేక్? అంటే.. ఇదిగో ఇదే ఆ ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.

కేన్స్ 2019 సంబ‌రాల్లో బాలీవుడ్ అంద‌గత్తెలు దీపిక‌.. ప్రియాంక చోప్రా.. కంగ‌న త‌మ‌దైన స్టైల్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌క‌ర‌కాల డిజైన‌ర్ డ్రెస్సుల్లో వేడుక‌కే ఆక‌ర్ష‌ణ పెంచారు. ఇక‌పోతే ఇదే వేడుక‌లో దీపిక‌తో క‌లిసి కాక్ టైల్ చిత్రంలో న‌టించిన డ‌యానా పెంటీ సైతం ఫ‌స్ట్ రెడ్ కార్పెట్ అప్పియ‌రెన్స్ ఇచ్చింది. అయితే ఈ లుక్ బావున్నా.. కాపీ క్యాట్ లుక్ లా ఉంది అంటూ నెటిజనుల్లో చ‌ర్చ సాగుతోంది.

ఇది కొత్త‌గా లేదు. ఇదివ‌ర‌కూ దీపిక ఇదే కేన్స్ లో ప్ర‌ద‌ర్శించిన లుక్ లానే ఉంది ఇంచుమించు. ఆ భారీత‌నం నిండిన గౌను.. డిజైన్ చేసిన లుక్ ప్ర‌తిదీ సేమ్ టు సేమ్ అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ త‌న ఫేవ‌రెట్ న‌టి దీపిక‌ను కావాల‌నే డ‌యానా అనుక‌రించిందా.. లేక డిజైన‌ర్ యాథృచ్ఛికంగానే ఇలా డిజైన్ చేశారా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఫ్రోజ‌న్ ఫిక్సెల్స్ స్టూడియోస్ డిజైనింగ్ సాయం అందుకుంది ఈ బ్యూటీ. డ‌యానా చోపార్డ్ పార్టీలోనూ పాల్గొని ఇదిగో ఇలా రెడ్ కార్పెట్ న‌డ‌క‌ల‌తో హొయ‌లు పోయింది. బ్లాక్ అండ్ పింక్ కాంబినేష‌న్ డిజైన‌ర్ వేర్ లో మెరుపులు మెరిపించే ప్ర‌య‌త్నం చేసింది.