Begin typing your search above and press return to search.
డిక్టేటర్ 4 రోజుల్లోనే సగం లాగేశాడు
By: Tupaki Desk | 18 Jan 2016 4:25 PM GMTసంక్రాంతి రిలీజ్ లలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన డిక్టేటర్ కి మిక్సెడ్ టాక్ వచ్చినా, కలెక్షన్స్ మాత్రం కుమ్మేస్తున్నాడు. బాలయ్య మహా మాస్ అవతారానికి ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. తొలి వీకెండ్ ముగిసేసరికి, కేవలం నాలుగు రోజుల్లోనే సగం టార్గెట్ రీచ్ అయిపోయాడు బాలయ్య.
డిక్టేటర్ కి ఏపీ, తెలంగాణల నుంచి తొలి నాలుగు రోజుల్లో 13.38 కోట్ల షేర్ వసూలుకావడం విశేషం. నైజాం ఏరియాలో 2.8 కోట్లు, సీడెడ్ నుంచి అత్యధికంగా 3.2 కోట్లు, వెస్ట్ 1.24 కోట్లు, ఈస్ట్ 1.29 కోట్లు, వైజాగ్ ఏరియా నుంచి 1.46 కోట్లను డిక్టేటర్ కొల్లగొట్టాడు. మొత్తం రెండు రాష్ట్రాల నుంచి 13.38 కోట్ల వసూళ్లు సాధించాడు. అయితే ఓవర్సీస్ లో డిక్టేటర్ పెర్ఫామెన్స్ పూర్ గానే ఉంది. ఇక్కడ సినిమా కానీ, కలెక్షన్స్ కానీ రికవర్ కావడం కష్టం అంటున్నారు అనలిస్టులు.
డిక్టేటర్ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 27 కోట్ల రూపాయలకు విక్రయించారు. అంటే ఈ మొత్తం రాబడితేనే, ఈ మూవీ సేఫ్ జోన్ లో ఉంటుంది. హిట్ అనిపించుకోవాలంటే ఈ 27 కోట్ల మార్క్ ను దాటాల్సిందే. అయితే 4 రోజుల్లోనే సగం పెట్టుబడి వచ్చేయడంతో, ఫుల్ రన్ లో ఈ లక్ష్యం అంత కష్టమేం కాకపోవచ్చనే అంచనాలున్నాయి. అయితే, సంక్రాంతి రిలీజ్ లు అన్నీ హిట్ టాక్ తెచ్చుకోవడం, వచ్చేవారం కూడా రిలీజ్ లు ఉండడంతో.. డిక్టేటర్ పై కొంతమేర ప్రభావం పడే అవకాశాలున్నాయి.