Begin typing your search above and press return to search.
డిక్టేటర్ బెనిఫిట్ షో ఫిక్సయింది
By: Tupaki Desk | 12 Jan 2016 10:39 AM GMTప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలకు బెనిఫిట్ షో అన్నది ప్రెస్టీజియస్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్లలో బెనిఫిట్ షోలు వేశారు.. అందులోనూ షోలు ఎంత అర్లీగా పడ్డాయి.. టికెట్ రేటు ఎంత పలికింది అన్నది కూడా అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణకు కొన్నేళ్లుగా ప్రతి సినిమాకూ బెనిఫిట్ షో పడుతోంది. ఐతే సంక్రాంతికి పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ‘డిక్టేటర్’ బెనిఫిట్ షోల గురించి కొంచెం డౌట్లు నెలకొన్నాయి. కానీ ఈ సినిమాకు కూడా తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో బెనిఫిట్ షోలు ప్లాన్ చేశారు అభిమానులు. హైదరాబాద్ లో బెనిఫిట్ షోలకు ఫేమస్ అయిన కూకట్ పల్లి భ్రమరాంభ థియేటర్లో ‘డిక్టేటర్’ షో పడనుంది.
14న, శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ‘డిక్టేటర్’ షో పడనుంది. టికెట్లు అవసరమైన వాళ్లు 9618184881, 9603032550 నంబర్లకు కాల్ చేయవచ్చు. ఇంకా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలన్నింట్లో ‘డిక్టేటర్’ బెనిఫిస్ షోలు పడుతున్నాయి. రాయలసీమలో అర్ధరాత్రికే షోలు ప్లాన్ చేస్తున్నారు. ఇక యుఎస్ లో అయితే ముందు రోజే ప్రిమియర్ షోలు వేస్తున్నారు. బాలయ్యకిది 99వ సినిమా కావడంతో అక్కడ 99 థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తుండటం విశేషం. ఇక ముందు రోజు విడుదలయ్యే మరో నందమూరి హీరో ఎన్టీఆర్ సినిమా ‘నాన్నకు ప్రేమతో’కు కూడా భారీ స్థాయిలో బెనిఫిట్ షోలు ప్లాన్ చేశారు. కూకట్ పల్లిలోని శివపార్వతి థియేటర్లో తెల్లవారుజామున 4 గంటలకు అక్కడ షో పడనుంది.