Begin typing your search above and press return to search.

ఇంతకీ ‘డిక్టేటర్’ పరిస్థితేంటి?

By:  Tupaki Desk   |   30 Jan 2016 5:30 PM GMT
ఇంతకీ ‘డిక్టేటర్’ పరిస్థితేంటి?
X
సంక్రాంతి సినిమాల ఫైనల్ రిజల్ట్ ఏంటన్నది తేలే సమయం ఆసన్నమైంది. వాటిలో ముందుగా ‘డిక్టేటర్’ పరిస్థితే తేటతెల్లమయ్యేలా ఉంది. ఎందుకంటే సంక్రాంతి సినిమాల్లో అన్నింటికంటే ముందు స్లో అయింది బాలయ్య సినిమానే. మిగతా మూడు సినిమాలూ ఇప్పటికీ బాగానే రన్ అవుతున్నాయి కానీ.. ‘డిక్టేటర్’ మాత్రం నామమాత్రంగా నడుస్తోంది. చాలా చోట్ల ఈ సినిమాను లేపేశారు. ఉన్న చోట్ల కూడా కలెక్షన్లు నామమాత్రంగా ఉన్నాయి. రెండో వారం సినిమాలు లేని అడ్వాంటేజీని ‘డిక్టేటర్’ పెద్దగా ఉపయోగించుకోవట్లేదు. తొలి వారంలోనే రూ.17.5 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసిన ‘డిక్టేటర్’ రెండో వారానికి అతి కష్టం మీద రూ.20 కోట్ల మార్కును అందుకుంది. ఐతే అక్కడి నుంచి మాత్రం బండి కదలట్లేదు.

ప్రస్తుతం ‘డిక్టేటర్’ రోజువారీ షేర్ చాలా తక్కువగా వస్తోంది. చాలా జిల్లాల్లో ఆ అమౌంట్ నెగోషియబుల్ ఫిగర్స్ లో ఉంటోంది. ఇక పూర్తిగా బండి ఆగిపోయే సమయానికి ‘డిక్టేటర్’ షేర్ రూ.21 కోట్లకు కాస్త పైన ఆగొచ్చని సమాచారం. అదే జరిగితే.. ‘డిక్టేటర్’ను హిట్ అనడానికి వీల్లేదు. ఏవరేజ్ మూవీగా సరిపెట్టేయాలి. ఎందుకంటే పాతిక కోట్ల క్లబ్బులో చేరితే తప్ప ‘డిక్టేటర్’ బ్రేక్ ఈవెన్ కు వచ్చినట్లు కాదు. ఒక్క రాయలసీమలో తప్ప బయ్యర్లందరూ అంతో ఇంతో నష్టం మిగుల్చుకోక తప్పేలా లేదు. సీమలో మాత్రం ‘డిక్టేటర్’ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటేసి.. లాభాలు పంచుతున్నాడు. అక్కడ ఈ సినిమా దాదాపు రూ.4.7 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ‘డిక్టేటర్’ సీడెడ్ రైట్స్ రూ.4 కోట్లకు అటు ఇటు తెగినట్లు సమాచారం.