Begin typing your search above and press return to search.

డిక్టేటర్‌ ను అక్కడ నుండి లేపేశారా..

By:  Tupaki Desk   |   17 Jan 2016 4:30 PM IST
డిక్టేటర్‌ ను అక్కడ నుండి లేపేశారా..
X
ఇంతకీ డిక్టేటర్‌ సినిమాను చూసి చాలామంది హాలీవుడ్‌ సినిమా ప్రియులు మాత్రం ఒక విధంగా షాక్‌ తినేశారు. ఎందుకంటే మొన్ననే అక్కడొచ్చిన ఒక సినిమాను తీసుకొని ఏకంగా డిక్టేటర్‌ ఫస్టాఫ్‌ ను తయారు చేశారు మన రైటర్లు.. శ్రీధర్‌ సీపాన - కోన వెంకట్‌ అండ్‌ గోపీ మోహన్‌.

ఒక హీరో.. డిపార్టుమెంటల్ స్టోరులో పనిచేస్తుంటాడు.. రోజూ మెట్రో లో ఆఫీస్‌ కు వెళుతుంటాడు.. అతగాడికి కాఫీ షాపులో ఒకమ్మాయి పరిచయం అవుతుంది.. ఆ అమ్మాయికి కొందరు దుండగులు వార్నింగ్‌ ఇస్తున్నప్పుడు అడ్డుపడితే.. మనోడికి వాళ్లు విజిటింగ్‌ కార్డ్‌ ఇస్తారు. తరువాత అమ్మాయి కనిపించకపోవడంతో.. ఆ కార్డు తీసుకొని వారి డెన్‌ కు వెళతాడు మనోడు. అక్కడ అందరినీ చితక్కొట్టేస్తాడు. సిసి టివి ఫుటేజ్‌ ద్వారా ఎవరు చంపారో తెలుసుకున్న మాఫియా.. ఇతగాడి కోసం వెతుకుతూ ఉంటుంది. కొందరు పోలీసులు కూడా హెల్ప్‌ చేస్తుంటారు. ఇదంతా డిక్టేటర్‌ ఫస్టాఫ్‌ కథ. సారీ.. ఇదే 2014లో హాలీవుడ్‌ లో వచ్చిన ''ది ఈక్వలైజర్‌'' సినిమా కథ. డెంజల్‌ వాషింగ్టన్‌ హీరో. దీన్ని యాజిటీజ్‌ గా దింపేస్తే.. అదే బాలయ్య డిక్టేటర్‌ అయిపోయింది.

సెకండాఫ్‌ కోసం మాత్రం.. అక్కడి కథను మొత్తంగా పక్కనెట్టేసి.. మనోళ్లు సొంతంగా బాలయ్య చేసిన అనేక సినిమాల కథలనే వాడుకున్నారు. ఆ విధంగా శ్రీధర్‌-కోన-గోపి లు ఒక హాలీవుడ్‌ సినిమాను లేపేసి కత చేయడం ఏమో గాని.. దర్వకుడు శ్రీవాస్‌ మాత్రం ఆ ఒరిజినల్‌ సినిమాలో ఉన్నంత పవర్‌ ఫుల్‌ గా ఇక్కడ కాపీ షాట్లను తీయలేకపోయాడు.