Begin typing your search above and press return to search.

డిక్టేటర్ లో పంచులు ఉన్నాయా? లేవా?

By:  Tupaki Desk   |   23 Dec 2015 7:30 PM GMT
డిక్టేటర్ లో పంచులు ఉన్నాయా? లేవా?
X
నందమూరి నటసింహం డైరెక్ట్ పాలిటిక్స్ లోకి దిగి, ఎమ్మెల్యే అవతారం ఎత్తాక.. ఆయన సినిమాలను ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా పట్టిపట్టి చూస్తున్నారు. ఇప్పుడు డిక్టేటర్ లో తమపై ఏం విరుపులు, ఎత్తిపొడుపులు ఉన్నాయా అని ప్రతిపక్షమైన వైసీపీ నేతలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.

గతంలో లెజెండ్ విషయంలోనూ తమ పార్టీ అధినేత, అగ్రనేతలపై కామెంట్స్ ఉన్నాయంటూ.. ఏపీ అధికారులకి, సెన్సార్ బోర్డ్ కి కంప్లెయింట్ చేశారు వైసీపీ లీడర్స్. ఇప్పుడు కూడా డిక్టేటర్ లోనూ తమ నేతకు వ్యతిరేకంగా కామెంట్స్ ఉంటాయన్నది వారి ఉద్దేశ్యం. ట్రైలర్ లో చూపించిన ప్రకారం అయితే.. ఓ శత్రువు - ఓ మహిళకు వ్యతిరేకంగా డైలాగ్స్ ఉన్నాయి. ఆ కేరక్టర్లు వైసీపీ అధినేత జగన్ తోపాటు రీసెంట్ గా ఏడాది పాటు సస్పెన్షక్ గురైనా రోజా పాత్రలను పోలి ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. అయితే.. డిక్టేటర్ నిర్మాతలు ఈ వాదనలను కొట్టి పడేస్తున్నారు. సాధారణ సినిమా స్టోరీ తప్ప.. ఎవరినీ పోలినట్లుగా పాత్రలు ఉండవని తేల్చేస్తున్నారు. మరోపైవు టీడీపీ లీడర్ల వాదన కూడా ఇలాగే ఉంది.

ప్రస్తుతం బాలయ్య ఎమ్మెల్యే కాబట్టి.. ఏదైనా అనదలచుకుంటే ప్రెస్ మీట్ పెట్టి నేరుగా కామెంట్ చేసే ఛాన్స్ ఉంది. అంతే తప్ప.. ఈ మాత్రం దానికి సినిమాని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా నిజమే అయినా.. బాలయ్య పవర్ ఫుల్ పంచ్ లు తమకు తగలడం ఖాయమనే అనుకుంటున్నారట. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందనే విషయం తేలాలంటే.. సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.