Begin typing your search above and press return to search.
బాలయ్య.. ఇంకా పది కోట్లు బాకీ
By: Tupaki Desk | 22 Jan 2016 5:30 PM GMTసంక్రాంతి రేసులో అందరి కంటే ముందు కాన్ఫిడెంటుగా దిగిపోయింది ‘డిక్టేటర్’ మూవీనే. ఎంత పోటీ ఉంటే మాకేంటి అన్న ధీమా చూపించాడు దర్శక నిర్మాత శ్రీవాస్. బాలయ్య సినిమా ధాటికి మిగతా సినిమాలు దెబ్బ తింటాయి తప్పితే.. వాటి ఎఫెక్ట్ తమకు ఉండదన్న కాన్ఫిడెన్స్ కనిపించింది అప్పుడు. కానీ ఇప్పుడేమో.. పండక్కి నాలుగు సినిమాలు పోటీ పడటం వల్ల అందరికీ నష్టం జరిగిందని అంటున్నాడు శ్రీవాస్.
నిజానికి మిగతా సినిమాల కంటే కూడా ‘డిక్టేటర్’కే నష్టం ఎక్కువ జరిగినట్లుంది. ఎందుకంటే మిగతా మూడు సినిమాల్లో రెండు (సోగ్గాడే చిన్నినాయనా - ఎక్స్ ప్రెస్ రాజా) ఇప్పటికే లాభాల బాటలోకి వచ్చేశాయి. ఎన్టీఆర్ మూవీ ‘నాన్నకు ప్రేమతో’ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ బ్రేక్ ఈవెన్ దిశగా సాగుతోంది. ఐతే ‘డిక్టేటర్’ పరిస్థితే కొంచెం కష్టంగా ఉంది. ఫస్ట్ వీకెండ్లో పరిస్థితి బాగానే ఉంది కానీ.. వీక్ డేస్ మొదలయ్యాక బండి నడవడం కష్టంగా ఉంది.
తొలి వారం ముగిసేసరికి ‘డిక్టేటర్’ షేర్ రూ.17.45 కోట్లకు చేరింది. తొలి నాలుగు రోజుల్లోనే రూ.13 కోట్ల దాకా తెచ్చుకున్న ఈ సినిమా ఆ తర్వాత స్లో అయింది. ‘డిక్టేటర్’ థియేట్రికల్ రైట్స్ రూ.27 కోట్ల దాకా అమ్మారు. అంటే ఇంకా రూ.10 కోట్లు వెనక్కి తెస్తే తప్ప బయ్యర్లు బయటపడరు. పోటీలో ఉన్న మిగతా సినిమాల జోరు చూస్తుంటే మాత్రం ‘డిక్టేటర్’ బ్రేక్ ఈవెన్ కు రావడం కష్టమే అన్నట్లుంది పరిస్థితి. మరి బాలయ్య సినిమా ఎక్కడిదాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.