Begin typing your search above and press return to search.

డిక్టేట‌ర్ రేస్ నుంచి త‌ప్పుకుంటున్నాడా?

By:  Tupaki Desk   |   26 Dec 2015 4:41 AM GMT
డిక్టేట‌ర్ రేస్ నుంచి త‌ప్పుకుంటున్నాడా?
X
నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకుంటున్నాడా? అబ్బాయ్ జూనియ‌ర్ ఎన్టీఆర్ తో? సొగ్గాడు నాగార్జుతో బ‌రిలో నిల‌వ‌లేక‌పోతున్నాడా? అంటే అవున‌నే వినిపిస్తోంది. బాల‌య్య 99వ సినిమా డిక్టేట‌ర్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోంది. కోన వెంక‌ట్ - గోపీ మోహ‌న్ వంటి రైట‌ర్ల‌ను రంగంలోకి దింపి మ‌రి క‌థ సిద్ధం చేయించారు. గ‌త సినిమా ల‌య‌న్ ప‌రాజ‌యం చెంద‌డంతో ఈ హిట్ తో మ‌ళ్లీ ఫామ్ లోకి రావాల‌ని బాల‌య్య ప‌ట్టు మీద ఉన్నారు.

అయితే నాగ్ - ఎన్టీఆర్ ల‌ పోటీని త‌ట్టుకోవాడం క‌ష్ట‌మ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తోన్న నాన్న‌కు ప్రేమ‌తో - నాగార్జున న‌టిస్తోన్న సోగ్గాడు చిన్ని నాయానా సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల‌పై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలున్నాయి. అటు బాల‌య్య డిక్టేట‌ర్ పై కూడా ఇంత‌కు మించి ఎక్స్ పెక్టేష‌న్స్ ఉన్నాయి. కానీ బాల‌య్య సినిమా కేవ‌లం స్టోరీ బ‌లం క‌న్నా ఇమేజ్ తోనే ఆడుతాయి. కోన ద్వ‌యం గురించి ప్ర‌త్యేకించాల్సిన ప‌నిలేదు. రొటిన్ క‌థ‌కే హాస్యాన్ని జోడించి తిప్పి తిప్పి క‌థ‌లు రాస్తారు. హీరో ఎలివేష‌న్ అనేది ఎలా ఉంటుందో డౌటే.

అందుకే ఇప్పుడు టీమ్ కు ఈ విష‌యంలో ఎక్క‌డో కొడుతుంది. నాన్న‌కు ప్రేమ‌తో తండ్రి సెంటిమెంట్ మీద న‌డుస్తుంది. అలాగే నాగ్ సొగ్గాడు ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం హ‌లో బ్ర‌ద‌ర్ సినిమాను త‌ల‌పించేలా ఉంటుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం ఉంది. అందుకే బాల‌య్య సినిమా కాస్త అటు ఇటుగా ఉన్న ఫ‌లితాలు తారుమార‌య్యే అవ‌కాశం లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో రేసు నుంచి త‌ప్పుకుంట‌నే మంచిద‌ని టీమ్ భావిస్తోంద‌ట‌.