Begin typing your search above and press return to search.

డిక్టేటర్‌ బ్యాక్ గ్రౌండ్ అదిరింది..

By:  Tupaki Desk   |   17 Sep 2015 12:44 PM GMT




డిక్టేటర్ మోషన్ పిక్చర్ ఎంత స్టయిలిష్ గా ఉందో.. దానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి రిలీజ్ చేసిన టీజర్ అంతకంటే సూబర్బ్ గా ఉంది. సింహాసనం లాంటి కుర్చీపై బాలయ్య కాలుమీద కాలేసుకుని కూర్చుని.. ఓ కాలు స్టయిల్ గా ఊపుతుంటే.. ఆ లుక్ ఫ్యాన్స్ ని కేకలు పెట్టించే స్థాయిలో ఉంది.

బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి సరిగ్గా సరిపోయేలా అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాడు ఎస్ఎస్ థమన్. ముఖ్యంగా బీజీఎం విషయంలో బాగా రాటుదేలాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. బాలకృష్ణ లాంటి పవర్ ఫుల్ పర్సనాలిటీ దొరికితే.. ఎంత గ్రాండ్ మ్యూజిక్ ఇవ్వచ్చో.. అంతగానూ ట్రై చేసినట్లుగా అనిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రేంజు రీ రికార్టింగ్‌ సినిమాలో ఉందంటే ఇక సినిమా పెద్ద హిట్టే. ఎందుకంటే వెంట్రుకలు నిక్కపొడుచుకునే నేపథ్య సంగీతం ఉంటే ఆటోమ్యాటిక్‌ గా యాక్షన్‌ సీన్లన్నీ భారీగా పండుతాయ్‌.

అయితే బీజీఎం విషయంలో థమన్ మంచి మ్యూజిక్ ఇస్తున్నా.. ఈ మధ్య పాటల విషయంలో బాగా వెనకబడ్డాడు. అనూప్, కార్తీక్ లాంటి కుర్రోళ్లు మెమరబుల్ సాంగ్స్ ఇస్తున్నా.. తమన్ కి అలాంటి వాటిపై అంత పట్టింపు ఉన్నట్లుగా కనిపించడం లేదు. దానికితోడు దాదాపు పెద్ద స్టార్ల ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు చేతిలో ఉండడంతో.. పాటలపై అంతగా కాన్సన్ ట్రేట్ చేయలేదని విమర్శలు ఎక్కువయ్యాయి. అసలే బాలయ్య స్టెప్పులు ఇరగదీస్తాడు. మరి డిక్టేటర్ పాటలను ఏం చేశాడో థమన్ ?