Begin typing your search above and press return to search.
రొటీన్ కంటెంట్ తో రొట్టె విరిచేయలేరు
By: Tupaki Desk | 29 Dec 2015 5:30 PM GMTతెలుగు సినిమా అంటే రొటీన్ సినిమా అన్న బ్యాడ్ నేమ్ మిగిలిపోయింది. రొటీనిటీ వల్లనే బ్రూస్ లీ - అఖిల్ - సౌఖ్యం - మామ మంచు లాంటి ఫ్లాప్ సినిమాల్ని చూడాల్సొచ్చిందన్న విమర్శలొచ్చాయి. అయితే మెజారిటీ భాగం రొటీన్ కంటెంట్ కోన వెంకట్ లాంటి స్టార్ రైటర్ల నుంచే రావడం వల్ల ఈ ముప్పు వచ్చిందన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఇక పోతే మిగతావాళ్లేమైనా డిఫరెంటుగా వస్తున్నారా? అంటే అదీ కనిపించలేదు. ఉన్న కథలతోనే .. పాత బాటిల్ లోనే కొత్త వైన్ తో వస్తాం అని ముందే చెప్పేసి వస్తున్నారు. ఫలితం బాక్సాఫీస్ వద్ద మిరాకిల్స్ అనేవి లేకుండా ఆగిపోయాయ్. ఏదో బతికిపోయాంలే అని చెప్పుకోవడానికి తప్ప ఆహా ..! ఓహో..! అని చెప్పుకోవడానికేం లేదు.
అయితే ఇలాంటి సందిగ్ధాల నుంచి తెలుగు ఆడియెన్ ని బైటపడేయడానికి ఇంకేవైనా సినిమాలొస్తున్నాయా? అంటే ఈ కొత్త సంవత్సరంలో అయినా అందుకు ఛాన్సుందా? అని వెతికితే.. జీరో అనే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే డిక్టేటర్ - నాన్నకు ప్రేమతో - సోగ్గాడే చిన్నినాయనా ఈ మూవీ టీజర్లు చూశాక... సంథింగ్ అవే అన్న తీరుగా ఏదీ లేదన్న విమర్శ వినిపిస్తోంది. అలాగే ఎ - బి - సి మూడు వర్గాల ఆడియెన్ ని కట్టిపడేసే సూత్రాలేవీ ఈ ముగ్గురి దగ్గర ఉన్నట్టు కనిపించలేదు. అయితే ఏ ఆడియెన్ మూవీ - లేదూ బి - సి ఆడియెన్ మూవీ అన్న చందంగానే ఉంది వ్యవహారం.
ఇకపోతే డిక్టేటర్ పూర్తిగా నందమూరి అభిమానులు, మాస్ నే టార్గెట్ చేసుకుని వస్తున్నట్టు కనిపిస్తోంది. నాగార్జున మాత్రం కాస్తంత ప్రయోగంతో వస్తున్నా.. మిగతావాళ్ల కంటే కొత్తగా కనిపిస్తా అని భావిస్తున్నారు. ఇందులో దెయ్యం అన్న కాన్సెప్టు కొత్తగా ఉంటుందని భావిస్తున్నారు. బి - సి సెంటర్లలో ఆకట్టుకునేందుకు పల్లెటూరి గెటప్పు - సెటప్పు ఉండనే ఉన్నాయని భావిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ తన కెరీర్ లోనే ఇంతకాలంలో కనిపించనంత కొత్తగా కనిపిస్తున్నాడు. అయితే ఈ మారిన రూపంతో క్లాస్ కి దగ్గరయ్యాడు. ట్రైలర్ అల్ర్టా మోడ్రన్ గా - చాలా క్లాస్ గా ఉంది. మరి మాస్ లోకి ఎలా దూసుకెళతాడో అన్న సందేహం వచ్చింది. ఈ క్రమంలో ఈ మూడు సినిమాల ఫేట్ ఏమిటన్నది తేలాల్సి ఉంది మరి.