Begin typing your search above and press return to search.

గోధుమ పిండిలో డ‌బ్బు క‌ట్ట‌లు పంచిన హీరో

By:  Tupaki Desk   |   28 April 2020 4:45 AM GMT
గోధుమ పిండిలో డ‌బ్బు క‌ట్ట‌లు పంచిన హీరో
X
గుంపులో ఒక‌డిగా కాదు.. గుంపును న‌డిపించే నాయ‌కుడిగా ఉండ‌డానికే ఇష్ట‌ప‌డ‌తారు కొంద‌రు. అలాంటి వాళ్ల‌లో మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ముందు వ‌రుస‌లో ఉంటారు. క్రియేటివిటీ అనేది కేవ‌లం వెండితెర‌పైనే ఆవిష్క‌రించేది కాదు. రియాలిటీలోనూ రియ‌ల్ లైఫ్ లోనూ ప్ర‌తి నిమిషం ఆవిష్క‌రించేది సృజ‌నాత్మ‌క‌త అని న‌మ్మి ఆచ‌రించే ఏకైక హీరో. అందుకే ఏ ఇత‌ర స్టార్ తో పోల్చి చూసినా అమీర్ ఎంతో స్పెష‌ల్. వ్య‌క్తిత్వంతో స్టార్ డ‌మ్ తో ప్ర‌త్యేక‌త‌ను ఆపాదించుకున్న హీరోగా అత‌డంటే వీరాభిమానం పొంగి పొర్లుతుంది.

లాక్ డౌన్ వ‌ల్ల ప్ర‌పంచం అట్టుడుకుతుంటే.. నిత్యావ‌స‌రాలు అంద‌క కార్మికులు రోడ్డున ప‌డుతుంటే మ‌న స్టార్లు చేస్తున్న ఆర్భాటం చూస్తున్నాం క‌దా? ప్ర‌భుత్వాల మెప్పు పొందేందుకు ఒక‌రు.. రాజ‌కీయంగా ల‌బ్ధి పొందేందుకు ఇంకొక‌రు.. రాబోయే ఎల‌క్ష‌న్ లో ఓట్లు దండుకోవాల‌ని వేరొక‌రు .. ఇలా ఎవ‌రికి వారు ప్ర‌జాసేవ అంటూ డ‌బ్బు.. నిత్యావ‌స‌రాల పంపిణీ చేస్తున్నారు. వీళ్లంద‌రికీ దిమ్మ‌ తిరిగేలా ప్ర‌జ‌లు చీవాట్లు పెట్టేలా అదిరే ట్రీటిచ్చాడు అమీర్ ఖాన్. ఇంత‌కీ ఏం చేశాడంటే..

తిండికి లేక అల్లాడుతున్న అవసరార్థుల‌ను ఆదుకునేందుకు అమీర్ ఓ మాస్ట‌ర్ ప్లాన్ వేశాడు. వారి కోసం గోధుమ పిండి ప్యాకెట్ల సంచులతో ఒక ట్రక్కును పంపారు. COVID-19 సంక్షోభ బాధితులు ఎక్క‌డున్నారో బాగా గ్రౌండ్ వ‌ర్క్ చేసిన అమీర్ త‌న బుర్ర‌కు ప‌దును పెట్టాడు. ఏప్రిల్ 23 న ఒక ట్రక్ ని దిల్లీలోని ఓ చోట‌ నిరుపేదలు నివ‌శించే ప్రాంతానికి పంపాడు. వాహనం అంతా ``ఒక కిలో ప్యాకెట్ పిండి``తో లోడ్ చేసి ఉంది. అయితే కేజీ గోధుమ పిండి ప్యాకెట్ కుటుంబాన్ని ఎన్నాళ్లు ఆదుకుంటుంది అని భావించిన ప్ర‌జ‌లు చాలా మంది అవి తీసుకోలేదు. అయితే తాజాగా రివీలైన ఓ టిక్ టాక్ వీడియోలో ప్యాకెట్లు తీసుకున్నవారు ఆ ప్యాకెట్ ఓపెన్ చేశాక షాక్ కి గుర‌వ్వ‌‌డం క‌నిపించింది. అంత‌గా షాక్ కి గురి చేసిన అంశం ఏమిటి? అంటే...

ప్రతి ప్యాకెట్ పిండిలో రూ .15 వేలు నగదును ఉంచారు అమీర్. ఇలా చేయ‌డం వెనుక అమీర్ ఐడియాల‌జీ బ‌లంగా ప‌ని చేసింద‌న‌డంలో సందేహమేం లేదు‌. టిక్ టాక్ వీడియో యాంకర్ ఈ విష‌యాన్ని ప్ర‌స్థావిస్తూ అమీర్ ఆలోచ‌న‌ను ఆకాశానికెత్తేసింది. ``డబ్బు నిజంగా పేద ప్రజలకు చేరేలా చేసిన ఏకైక స్టార్`` అంటూ పొగిడేసింది. క‌చ్చితంగా ఇలాంటి టైమ్ లో బాగా క‌ష్టాల్లో ఉన్నవారు మాత్రమే ఒక కిలో పిండి కోసం వరుసలో నిల‌బ‌డ‌తారు. అంత ఇబ్బంది లేని వాళ్లు క్యూలో ఉండేందుకు ఇష్ట‌ప‌డ‌రు క‌దా! అని ఆ యాంక‌ర్ పేర్కొంది.

బాలీవుడ్ టాలీవుడ్ లోని ఇతర సూపర్ స్టార్ల లాగా అమీర్ తన సామాజిక సేవను బహిరంగంగా ప్రకటించేందుకు ఇష్ట‌ప‌డ‌రు. ప‌లు మీడియాలు ఈ విష‌యంపై ఆరాలు తీసేందుకు ప్ర‌య‌త్నించినా అమీర్ ఆ విష‌యాన్ని గోప్యంగా ఉంచాడు త‌ప్ప ఎక్క‌డా ఆర్భాటానికి పోలేదు. ప‌బ్లిసిటీ పిచ్చ‌తో నాట‌కాలాడ‌లేదు. క‌నీసం ఇలాంటి స్టార్ల‌ను చూసి అయినా మ‌న ఊద‌ర‌గొట్టుడు సెల‌బ్రిటీలు కాస్త ఇంగితం నేర్చుకుంటే మేలేమో!