Begin typing your search above and press return to search.
ఏంజెలినా జోలీ `అవెంజర్స్ స్టార్`తో ఎఫైర్ సాగించారా?
By: Tupaki Desk | 28 May 2021 1:30 AM GMTహాలీవుడ్ హాట్ పెయిర్ ఏంజెలినా జోలీ - బ్రాడ్ ఫిట్ జంట ఒకరినుంచి ఒకరు విడిపోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఫ్యామిలీ కోర్టులో విచారణ సాగుతోంది. పిల్లల పెంపకం సహా ఆస్తుల పంపకాల పైనా కోర్టుల్లో చిక్కుముడులు వీడడం లేదు. ఇక ఇదే సమయంలో ఏంజెలినా జోలీ ఫలానా నటుడితో ఎఫైర్ సాగించింది అంటూ కొన్ని గాసిప్ వెబ్ సైట్లలో ప్రచారం కావడం సంచలనమైంది.
దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద డిబేట్ రన్ అవుతోంది. స్టార్ ట్రెక్-థోర్- అవెంజర్స్ వంటి చిత్రాల్లో నటించిన క్రిస్ హేమ్స్‌వర్త్ కు ఏంజెలీనా జోలీతో ఎఫైర్ ఉందని గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే నిజానికి అందుకు ఆస్కారమే లేదన్నది నెటిజనుల డిబేట్. ఈ ఎఫైర్ కి ఎటువంటి సూచనలు లేదా నిజమైన ఆధారాలు లేవు. అదేవిధంగా ఎల్సా పటాకితో హేమ్స్ వర్త్ వివాహబంధం విచ్ఛిన్నం కాలేదు.. ఆ ఇద్దరిపైనా చాలా గాసిప్ రాగ్స్ ఉన్నప్పటికీ అవేవీ నిజాలు కాలేదు.
ఈ భయంకరమైన ఉద్ధేశపూర్వక పుకారు మూలాలు ఒక గాసిప్ రాగ్ నుంచి పుట్టుకొచ్చినవి. వెబ్ కథనాల నుండి వచ్చినవి. ఇది వారి అసంబద్ధమైన వాదనలు చేయడానికి తెలివిగా వీరిద్దరి చిత్రాన్ని సవరించి రాసిన నిరాధార గాసిప్ లు గా నెటిజనుల్లో చర్చ సాగుతోంది.
ప్రాథమికంగా 2018 గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సందర్భంగా క్రిస్ హేమ్స్‌వర్త్ - ఏంజెలీనా జోలీ ఒకే టేబుల్ వద్ద కూర్చున్నారు. గాసిప్ రాగ్ ఆ చిత్రాన్ని `హేమ్స్ వర్త్-పటాకి` వివాహ జీవితంలో ఇబ్బంది గురించి వారి అర్ధంలేని కథనాన్ని రాయడానికి ఏంజెలీనా జోలీతో ఎఫైర్ అంటూ కథనాలు అల్లారు. గాసిప్ రాయుళ్లు ఆ ఫోటోని కొంత సవరించారు. ఇది చాలా దుర్మార్గపు వ్యవహారం అంటూ డిబేట్ సాగింది.
ఆ గాసిప్ రాగ్ వెబ్ సైట్ కు వెబ్ ట్రాఫిక్ కోసం మొదటగా ఈ కథనాన్ని ఎవరు రాశారు? ఏదేమైనా గాసిప్ రాసిన తీరు సరికాదు. ప్రజలు ప్రముఖుల జీవితాల్లో కుంభకోణాల్ని వ్యక్తిగత విషయాల్ని తెలుసుకునేందుకు ఇష్టపడతారు. కుంభకోణం నిజమా కాదా అనే దానితో సంబంధం లేకుండా దాని గురించి చదువుతారు..అందుకే ఇలా రాస్తారు.. కానీ ఇది సరికాదు! అంటూ అభిమానులు నెటిజనుల్లో తీవ్రమైన చర్చ సాగుతోంది.