Begin typing your search above and press return to search.

చైతూకు స‌మంత‌కు ముందే ల‌వ్ స్టోరీ వుందా?

By:  Tupaki Desk   |   16 Aug 2022 8:36 AM GMT
చైతూకు స‌మంత‌కు ముందే ల‌వ్ స్టోరీ వుందా?
X
యంగ్ హీరో నాగ‌చైత‌న్య గ‌త ఏడాది అక్టోబ‌ర్ లో స్టార్ హీరోయిన్ స‌మంత‌తో విడాకులు తీసుకుని వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై ఇంత వ‌ర‌కు స్పందించ‌ని చై అది త‌న వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారం అని, ఆ విష‌యాన్ని వ‌దిలేయాల‌ని ప‌లు మీడియా మీట్ ల‌లో చెప్పుకుంటూ వ‌స్తున్నారు. అంతే కాకుండా స‌మంత క‌నిపిస్తే హాయ్ చెప్పి హ‌గ్ ఇస్తాన‌ని వెల్ల‌డించి షాకిచ్చిన చై భ‌విష్య‌త్తులో ఇద్ద‌రం క‌లిసి న‌టించే అవ‌కాశం రావ‌చ్చేమో అంటూ కామెంట్ లు చేశారు.

ఇదిలా వుంటే రీసెంట్ గా త‌న ఫ‌స్ట్ ల‌వ్ గురించి ప‌లు షాకింగ్ విష‌యాల‌ని వెల్ల‌డించాడు. బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తో క‌లిసి నాగ‌చైత‌న్య 'లాల్ సింగ్ చ‌డ్డా' మూవీలో న‌టించిన విష‌యం తెలిసిందే. ఆగ‌స్టు 11న ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైంది. అద్వైత్ చంద‌న్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని హాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'ఫారెస్ట్ గంప్‌' ఆధారంగా తెర‌కెక్కించారు. వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద దారుణ ఫ‌లితాన్ని రాబ‌ట్టి షాకిచ్చింది.

ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా బాలీవుడ్ మీడియాతో ముచ్చ‌టించిన నాగ‌చైత‌న్య త‌న ఫ‌స్ట్ ల‌వ్ గురించి ప‌లు షాకింగ్ విషయాల్ని బ‌య‌ట‌పెట్టార‌ట‌. స‌మంత‌తో ల‌వ్ మ్యారేజీకి ముందే త‌న‌కు ఓ ల‌వ్ స్టోరీ వుంద‌ని చెప్పుకొచ్చాడ‌ని.

అయితే అది కాలేజీ రోజుల్లో అని స్ప‌ష్టం చేశాడ‌ని తెలిసింది. ఒకానొక స‌మ‌యంలో త‌ను ప్రేమించిన అమ్మాయితో రొమాన్స్ చేశాన‌ని, కారు వెన‌క సీట్లో కూర్చుని త‌ను ప్రేమించిన గాళ్ ఫ్రెండ్ ని కిస్ చేస్తూ పోలీసుల‌కు హైద‌రాబాద్ లో అడ్డంగా దొరికి పోయాన‌ని స‌ద‌రు బాలీవుడ్ మీడియాకు వెల్లడించిన‌ట్టుగా తెలిసింది.

అయితే అది త‌న‌కు త‌ప్పుగా అనిపించ‌లేద‌ని చెప్పుకొచ్చాడట‌. మ‌షాబుల్ ఇండియా వారి 'ది బాంబే జ‌ర్నీ' షో లో పాల్గొన్న నాగ‌చైత‌న్య ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ షోని హోస్ట్ చేస్తున్న సిద్ధార్ట్ త‌న జీవితంలో జ‌రిగిన రొమాంటిక్ సంఘ‌ట‌నని గుర్తు చేసుకున్న క్ర‌మంలో నాగ‌చైత‌న్య త‌న‌కు కూడా ఇదే త‌ర‌హా సంఘ‌ట‌న జ‌రిగింద‌ని, త‌న గాళ్ ఫ్రెండ్ ని కిస్ చేస్తుంటే పోలీసుల‌కు దొరికి పోయాన‌ని అస‌లు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టాడట‌.

విడాకుల త‌రువాత మీపై లేడీస్ దృష్టి బాగా ప‌డిన‌ట్టుంద‌ని సిద్ధార్ద్ ప్ర‌శ్నిస్తే.. లేడీస్ దృష్టి ఎప్పుడూ వుంటుంది. అయితే అది పాజిటివ్ వేలో వుటుంది. నా ఉద్దేశ్యం మంచి మార్గంలో వుంటుంద‌ని. అంతే కాకుండా లేడీస్ దృష్టిని ఆక‌ర్షించ‌డం ఎప్పుడూ ఆనందంగానే వుంటుంది' అని స‌మాధానం చెప్పాడ‌ట‌. చై చెప్పిన స‌మాధానాలు ఇప్ప‌డు నెట్టింట వైర‌ల్ గా మారాయి.