Begin typing your search above and press return to search.
స్టార్ డైరెక్టర్ ని చైతూ పక్కన పెట్టేశాడా?
By: Tupaki Desk | 4 July 2022 11:37 AM GMTఎప్పుడు ఎవరి జాతకాలు తారుమారవుతాయో ఇక్కడ చెప్పడం కష్టం. ప్రతీ శుక్రవారం జాతాకాలు మారిపోతుంటాయిక్కడ. అందుకే ప్రతి శుక్రవారం వచ్చే ఫలితాలని బట్టే ప్రాజెక్ట్ లు ముందు వెళుతుంటాయి. అనుకున్న ఫలితం రాలేదా? ఆ తరువాత సినిమా అటకెక్కినట్టే. ఇప్పడు అదే పరిస్థితిని స్టార్ డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ ఎదుర్కొంటోంది. వివరాల్లోకి వెళితే.. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 'సర్కారు వారి పాట'ని తెరకెక్కించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మే 12న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. మంచి సబ్జెక్ట్ నే ఎంచుకున్నా పరశురామ్ కరెక్ట్ గా డీల్ చేయలేకపోయాడు. దీంతో భారీ మూవీని డీల్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. దీంతో ఈ మూవీ ఫ్యాన్స్ అంచనాలని అందుకోలేకపోయింది. ఈ మూవీ తరువాత పరశురామ్ హీరో నాగచైతన్యతో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని ప్లాన్ చేసుకున్నారు. 14 ప్లస్ రీల్స్ సంస్థ భారీ స్థాయిలో నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 'నాగేశ్వరరావు' అనే టైటిల్ ని కూడా ఫైనల్ చేయాలనే ఆలోచనలో వున్నారు.
అయితే ఈ మూవీని ప్రస్తుతం నాగచైతన్య చేయడానికి ఆసక్తిని చూపించడం లేదు. ఇటీవలే 'థాంక్యూ' మూవీని పూర్తి చేసిన చై ఈ మూవీ తరువాత తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో ఓ బై లింగ్వల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ మూవీపైనే చైతూ దృష్టి పెట్టారు. దీని తరువాతే మిగతా సినిమాలు చేయాలనుకుంటున్నారు. అంటే పరశురామ్ మూవీని ఇప్పట్లో నాగచైతన్య చేయాలనుకోవడం లేదన్న మాట.
ఈ మూవీ తరువాతే పరశురామ్ సినిమాని చేయాలనుకుంటున్నారట. దీంతో వెంకట్ ప్రభుతో చేయనున్న సినిమా పూర్తి కావాలంటే 7 నుంచి 8 నెలలు ఖచ్చితంగా పడుతుంది. అంత వరకు పరశురామ్ ని హోల్డ్ లోనే పెట్టడంతో తను వేయిటింగ్ లో వుంటాడా? లేక మరో హీరోతో వెళతాడా? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. పరశురామ్ 'సర్కారు వారి పాట'కు ముందు ఈ సినిమా చేయాల్సింది. అయితే మహేష్ డేట్స్ లభించడంతో చైతూ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి 'సర్కారు వారి పాట'ని రూపొందించడానికి వెళ్లిపోయారు.
దీంతో చైతూ విక్రమ్ కె. కుమార్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వచ్చింది. తనని వెయిట్ చేయించాడు కాబట్టి ఇప్పడు తను పరశురామ్ ని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టడం ఆసక్తికరంగా మారింది. అదీ కాకుండా మరో యంగ్ డైరెక్టర్ సినిమాకు కూడా నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పరశురామ్ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి.