Begin typing your search above and press return to search.
చరణ్ సినిమాకు అంత బిజినెస్ జరిగిందా?
By: Tupaki Desk | 5 Sep 2022 6:11 AM GMT'RRR'తో ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి క్రేజ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న క్రేజీ స్టార్ రామ్ చరణ్. ప్రీ ఇండిపెండెంట్ ఎలా నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయిన అబ్బుర పరిచిన విషయం తెలిసిందే. ఈ మూవీలో చరణ్ నటనకు ప్రతీ ఒక్కరు ఫిదా అయ్యారు. ఈ మూవీ ఇటీవల జీ5, నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కావడంతో విదేశీ ప్రేక్షకులతో పాటు హాలీవుడ్ స్టార్స్ కూడా చరణ్ నటనకు మంద్ర ముగ్ధులయ్యారు.
'RRR'తో ప్రపంచ వ్యాప్తంగా తనకు భారీ క్రేజ్ లభించడంతో రామ్ చరణ్ తన తదుపరి సినిమాని ఔత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్న విషయం తెలిసిందే. RC15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని రూపొందిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 90వ దశకంలో జరిగిన కొన్ని సంఘటనలకు నేటి కాలానికి లింకప్ చేస్తూ పొలిటికల్ థ్రిల్లగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీ కీలక షెడ్యూల్స్ రాజమండ్రి, అమృత్ సర్ లలో పూర్తి చేశారు. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిపిన షూటింగ్ లో కీలక ఘట్టాల షూటింగ్ పూర్తయింది. ఇక శంకర్ 'ఇండియన్ 2' షూటింగ్ ని తిరిగి ప్రారంభించిన నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చారు. కమల్ 'ఇండియన్ 2' షూటింగ్ చేస్తూనే RC15 ని కూడా సమాంతరంగా పూర్తి చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు కూడా.
ఇదిలా వుంటేంటే ఈ మూవీకి సంబంధించిర కీలక అప్ డేట్ ట్రేడ్ వర్గాలని ఆశ్యర్యానికి గురిచేస్తోంది. పాన్ ఇండియా స్థాయి మూవీగా అత్యంత భారీ స్థాయిలో రేపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ బిజినెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 'RRR'తో చరణ్ క్రేజ్ భారీ స్థాయికి చేరడంతో ఈ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ కి రికార్డు స్థాయి ఆఫర్ లభించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మూవీ నాన్ థియేట్రికల్ హక్కులకు దాదాపు రూ. 200 కోట్లు పలికినట్టుగా తెలుస్తోంది. చరణ్ సినిమాక ఈ స్థాయి మొత్తం నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో రావడం రికార్డుగా చెబుతున్నారు. నాన్ థియేట్రికల్ బిజినెసే ఈ రేంజ్ లో వుంటే ఇక థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్ లో వుండే అవకాశం వుందని, చరణ్ సినిమాల్లోనే ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ పరంగా రికార్డులు సృష్టించడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.