Begin typing your search above and press return to search.

'వార‌సుడు' విష‌యంలో దిల్ రాజు లెక్క త‌ప్పిందా?

By:  Tupaki Desk   |   5 Jan 2023 2:30 AM GMT
వార‌సుడు విష‌యంలో దిల్ రాజు లెక్క త‌ప్పిందా?
X
టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ప్ర‌తీ సినిమాని త‌న లెక్క‌ల ప్ర‌కారం చేస్తూ వెళుతుంటారు. బ‌డ్జెట్ ఎక్క‌డా పెర‌గ‌కుండా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో అంతా ద‌గ్గ‌రుండి చూసుకుంటుంటారు. మ‌రీ ముఖ్యంగా బ‌డ్జెట్ విష‌యంలో చాలా ప‌క‌డ్బంధీగా వ్య‌వ‌హ‌రిస్తుంటార‌నే పేరుంది. అయితే అలాంటి దిల్ రాజు లెక్క `వార‌సుడు` విష‌యంలో త‌ప్పింద‌ని తెలిసింది. వివ‌రాల్లోకి వెళితే.. ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా దిల్ రాజు నిర్మించిన తొలి త‌మిళ మూవీ `వారీసు`. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కత్వం వ‌హించారు.

ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీని తెలుగులో `వార‌సుడు`గా రిలీజ్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. లిరిక‌ల్ వీడియోల‌తో ర‌చ్చ చేస్తున్న ఈ మూవీపై ఇప్ప‌టికే త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో భారీ క్రేజ్ ఏర్ప‌డింది. ఆ క్రేజ్ కి త‌గ్గ‌ట్టే దిల్ రాజు ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ని తెలుగులో కంటే త‌మిళంలోనే అధికంగా చేస్తున్నాడు. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో సంక్రాంతి బ‌రిలో జ‌న‌వ‌రి 12న రిలీజ్ కానున్న ఈ మూవీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ ఒక‌టి ఫిల్మ్ సర్కిల్స్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

`వారీసు` మూవీని అనుకున్న బ‌డ్జెట్ లో వంత రోజుల్లో పూర్తి చేయాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ట‌. అయితే ఆ లెక్క త‌ప్పిన‌ట్టుగా తెలుస్తోంది. తొలి సినిమా `మున్నా` నుంచి మొన్న‌టి `మ‌హర్షి` వ‌ర‌కు ఏ సినిమా విష‌యంలోనూ అనుకున్న డేస్ లో షూటింగ్ పూర్తి చేయ‌ని వంశీ పైడిప‌ల్లి `వారీసు` విష‌యంలోనూ అదే చేశాడ‌ట‌. అనుకున్న దానికి మించి మ‌రో 50 రోజులు ఎక్కువే తీసుకోవ‌డంతో ముందు అనుకున్న బ‌డ్జెట్ రూ. 30 కోట్లు ఎక్కువే అయిన‌ట్టుగా తెలుస్తోంది.

ఇదిలా వుంటే ఇప్ప‌టికే విజ‌య్ క్రేజ్ కార‌ణంగా అన్ని ర‌కాల రైట్స్ ప‌రంగా దిల్ రాజు రూ. 50 కోట్ల ప్రాఫిట్ లో వున్నాడ‌ట‌. ఇక థియేట్రిక‌ల్ ర‌న్ అద‌నంగా రానుంద‌ని తెలుస్తోంది. త‌మిళ‌నాట ఈ మూవీ విజ‌య్ క్రేజ్ కార‌ణంగా భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం ఖాయం అని చెబుతున్నారు. తెలుగులోనూ ఈ సినిమా భారీ లాబాల్ని ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. బ‌డ్జెట్ విష‌యంలో దిల్ రాజు ఎంత లెక్క త‌ప్పినా ప్రాఫిట్ ల విష‌యంలో మాత్రం లెక్క గ‌ట్టిగానే అందేలా వుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.