Begin typing your search above and press return to search.

జ‌క్క‌న్న వారిని బ‌క‌రాల‌ని చేసిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   15 Nov 2022 5:30 PM GMT
జ‌క్క‌న్న వారిని బ‌క‌రాల‌ని చేసిన‌ట్టేనా?
X
'బాహుబ‌లి'తో రాజ‌మౌళి దేశ వ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. అయితే రీసెంట్ గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల‌తో క‌లిసి చేసిన పాన్ ఇండియా వండ‌ర్ 'RRR'తో వ‌ర‌ల్డ్ వైడ్ గా వున్న విదేశీ సినీ ప్రియుల్ని కూడా మెప్పించ‌డ‌మే కాకుండా ద‌ర్శ‌కుడిగా మ‌రింత పాపులారిటీని సొంతం చేసుకుని హాట్ టాపిక్ గా మారిపోయాడు. ప్ర‌స్తుతం 'RRR' ని 2023లో జ‌ర‌గ‌నున్న ఆస్కార్ అకాడ‌మీ అవార్డుల‌కు నామినేట్ అయ్యే విధంగా లాబీయింగ్ చేస్తున్నాడు.

ఇందుకు సంబ‌ధించి ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్లు కూడా త‌మ వంతు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. వారి ప్ర‌య‌త్నాల నేప‌థ్యంలోనే ఇటీవ‌ల లాస్ ఏంజీల్స్ లోని ఐమ్యాక్స్ థియేట‌ర్లో ఈ మూవీని ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించ‌డం, రాజ‌మౌళికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డం తెలిసిందే. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఐదు భాష‌ల్లో సంచ‌ల‌నాలు సృష్టించిన మూవీని నెల్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయ‌డంతో మ‌రింత క్రేజ్ పెరిగింది. మ‌రింత మందికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీ రీచ్ కావ‌డంతో ప్ర‌తీ ఒక్క‌రూ ఇప్ప‌డు రాజ‌మౌళి గురించి గొప్ప‌గా మాట్లాడ‌టం మొద‌లు పెట్టారు.

హాలీవుడ్ మేక‌ర్స్, రైట‌ర్స్‌, డైరెక్ట‌ర్స్ 'RRR' పై ప్ర‌శంస‌లు కురిపిస్తూనే ఆస్కార్ అకాడ‌మీ దృష్టిని ఈ మూవీని తీసుకెళుతున్నారు. ఆస్కార్ అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ కు 'RRR'ని ట్యాగ్ చేస్తూ ఈ మూవీపై ఆస్కార్ అకాడ‌మీ దృష్టి ప‌డేలా చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీని రీసెంట్ గా జ‌పాన్ లో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ తో క‌లిసి రాజ‌మౌళి అక్క‌డికి వెళ్లి ప్ర‌మోట్ చేశారు కూడా. ప్ర‌స్తుతం 'RRR' జపాన్ లో రికార్డులు తిర‌గ‌రాస్తూ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

ఇదిలా వుంటే ఈ మూవీకి సీక్వెల్ ని చేయ‌బోతున్నాన‌ని, ప్ర‌స్తుతం త‌న తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ రాస్తున్నార‌ని వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. 'RRR'ని మ‌రి కొంత కాలం వార్త‌ల్లో నిల‌వాల‌నే స్ట్రాట‌జీతో రాజ‌మౌళి ఈ ప్ర‌క‌ట‌న చేశాడ‌ని తెలుగు మీడియా ప‌ట్టేసింది. రాజ‌మౌళి సీక్వెల్ పేరుతో నాన్నా పులి క‌థ చెబుతున్నాడ‌ని కామెంట్ లు చేసింది. అయితే ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియా మాత్రం రాజ‌మౌళి మాట‌ల్ని సీరియ‌స్ గా తీసుకుని భారీ స్థాయిలో ప్ర‌మోట్ చేయ‌డం మొద‌లు పెట్టింది.

రాజ‌మౌళికి కావాల్సింది ఇదే కాబ‌ట్టి ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియా ప్ర‌చారాన్ని ఎంజాయ్ చేస్తున్నార‌ని, ఒక విధంగా చెప్పాలంటే వారిని 'RRR' సీక్వెల్ అంటూ బ‌క‌రాల‌ని చేశార‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. కార‌ణం 'RRR' త‌ర్వాత రాజ‌మౌళి సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో భారీ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ కు శ్రీ‌కారం చుట్ట‌బోతున్న విష‌యం తెలిసిందే. దీని త‌రువాత 'మ‌హాభార‌తం'ని తెర‌పైకి తీసుకొచ్చే అవ‌కాశం వుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో 'RRR' కి సీక్వెల్ ని జ‌క్క‌న్న చేస్తాడంటే ఎవ‌రూ న‌మ్మ‌రు కానీ ఇంటర్నేష‌న‌ల్ మీడియా నమ్మోసి జోరుగా ప్ర‌చారం చేస్తుండ‌టంతో అంతా జ‌క్క‌న్న భ‌లే బ‌క‌రాల‌ని చేశాడంటూ కామెంట్ లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.