Begin typing your search above and press return to search.
ఏంటి.. 'బాహుబలి 2' రికార్డును 'జాతిరత్నాలు' బ్రేక్ చేసిందా.. నిజమేనా?
By: Tupaki Desk | 18 March 2021 10:30 AM GMT'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన 'జాతిరత్నాలు' సినిమా సంచలన విజయం సాధించింది. అనుదీప్ కేవీ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సినిమా ఫస్ట్ డే నుంచే వసూళ్ళ వేట సాగించింది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రియదర్శి - రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఫస్ట్ వీక్ లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 27.70 కోట్లు షేర్ తో పాటు రూ. 46 కోట్లు గ్రాస్ ను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సక్సెస్ ఫుల్ గా రెండో వారంలోకి ఎంటర్ అయిన 'జాతిరత్నాలు' కొన్ని థియేటర్స్ లో 'బాహుబలి 2' రికార్డులను బ్రేక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
హైదరాబాద్ లో థియేట్రికల్ బిజినెస్ కి అడ్డా అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్లలో 'బాహుబలి 2' కంటే ఎక్కువ కలెక్ట్ చేసినట్లు చెబుతున్నారు. 'జాతిరత్నాలు' సినిమా మెయిన్ థియేటర్ దేవి 70MM లో మొదటి వారంలో 38 లక్షల వసూళ్లతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఆల్ టైమ్ ఫస్ట్ వీక్ గ్రాస్ రాబట్టిన సినిమాల జాబితాలో మూడో స్థానానికి చేరినట్లు పేర్కొన్నారు. ఆ లెక్కల ప్రకారం సుదర్శన్ థియేటర్ లో సుమారు 36 లక్షల గ్రాస్ వసూలు చేసిన 'బాహుబలి 2' రికార్డ్ బ్రేక్ అయినట్లు. నిజానికి చాలా రోజుల తర్వాత థియేటర్లలోకి వచ్చిన కామెడీ చిత్రం కావడంతో ప్రేక్షకులు 'జాతిరత్నాలు' కు బ్రహ్మరథం పట్టారు. అయితే ఏ-సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ సాధించినప్పటికకీ.. బి సి సెంటర్స్ లో దీని ప్రభావం తక్కువ గానే కనిపించింది. ఈ నేపథ్యంలో ఒక థియేటర్ లో 'బాహుబలి 2' రేంజ్ కలెక్షన్స్ ని దాటిపోయిందంటే అవి నమ్మశక్యంకాని వార్తలనే అనుకోవాలి.