Begin typing your search above and press return to search.
మెగా అల్లుడు ఆర్గానిక్ థెరపీ కోసం వెళ్లాడా..?
By: Tupaki Desk | 24 March 2020 5:30 PM GMTచిరంజీవి అల్లుడిగా, మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో కళ్యాణ్ దేవ్. విజేత సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన కళ్యాణ్ ఈ చిత్రం ద్వారా పర్వాలేదు అనిపించుకున్నాడు. ఈ చిత్రం పరాజయం కావడంతో ఆచితూచి అడుగులు వేస్తున్న కళ్యాణ్ దేవ్ తన రెండవ చిత్రంగా'సూపర్ మచ్చి' చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి పులివాసు దర్శకత్వం వహిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో రియా చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలావుండగానే కళ్యాణ్ మరో చిత్రాన్నీ లైన్ లో పెట్టాడు. శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయినట్లు ప్రకటించాడు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జిఎటూ ప్రొడక్షన్స్ సమర్పిస్తుంది. తమన్ మ్యూజిక్ ఇస్తున్న ఈ చిత్రంలో అవికాగోర్ ని హీరోయిన్ గా అనుకుంటున్నట్లు సమాచారం.
కళ్యాణ్ దేవ్ కి సంబంధించి రీసెంట్ గా ఒక న్యూస్ బయటికి వచ్చింది. చిరంజీవి అల్లుడు తన వెయిట్ తగ్గించుకోవడం కోసం ఆర్గానిక్ థెరపీ చేయించుకుంటున్నాదంట. దీని కొసం కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీధర్ సీపాన డైరెక్షన్ లో తెరకెక్కనున్న ప్రేమకథ చిత్రం కోసం కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. విజేత సినిమాలో అంతంత మాత్రమే నటన కనబరిచిన దేవ్ ఈ సినిమా ద్వారా మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యాడట. దాని కోసమే ఇలాంటి థెరపీలు తీసుకుంటున్నట్లు అభిమానులు అనుకుంటున్నారు. ఏదేమైనా ఈ చిత్రాల మెగా అల్లుడు విజయం సాధించి ఇండస్ట్రీలో నిలిచిపోవలని మెగా ఫాన్స్ కోరుకుంటున్నారు.