Begin typing your search above and press return to search.
ఆ డైరెక్టర్ కి కింగ్ నాగ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడా?
By: Tupaki Desk | 11 Oct 2022 5:30 PM GMTటాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ హీరోల్లో కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కింగ్ నాగార్జున చేసినన్ని ప్రయోగాలు ఏ హీరో చేయలేదు. నాగార్జున తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ లు, గేమ్ ఛేంజర్ లు.. ట్రెండ్ సెట్టర్ హిట్ లు చూశారు. దీంతో ఆయన జడ్జిమెంట్ ని ప్రతీ ఒక్కరు ప్రత్యేకంగా చూసే వారు. ఆయన చేసే సినిమాల దర్శకులు కానీ, నాగచైతన్య, అఖిల్ తో కలిసి చేసే డైరెక్టర్లు కానీ నాగ్ చెప్పిన మార్పులకు ప్రధాన ప్రియారిటీ ఇచ్చేవారు.
నాగ్ చెప్పిన మార్పులు సినిమాలకు ప్లాస్ అవుతూ రావడం, సరికొత్త విజయాలని అందిస్తూ రావడంతో ఆయన మాటకు, మార్పులకు విలువ ఇచ్చే వారు కూడా క్రమ క్రమంగా ఎక్కువయ్యారు. అయితే గత కొంత కాలంగా వరుస ఫ్లాప్ లని నాగార్జున ఎదుర్కొంటుండటం.. కథల ఎంపిక విషయంలో ఆయన జడ్జిమెంట్ ఫెయిల్ అవుతూ వస్తోంది. 'సోగ్గాడే చిన్నినాయన' తరువాత నాగ్ ఆ స్థాయి విజయాన్ని ఇప్పటికీ అందుకోలేకపోవడమే ఇందు నిదర్శనంగా నిలుస్తోంది.
మధ్యలో 'బంగార్రాజు' మూవీతో కొంత ఊరట లభించినా 'సోగ్గాడే చిన్నినాయన' స్థాయి విజయాన్ని మాత్రం నాగార్జున అందుకోలేక గత కొన్నేళ్లుగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. రీసెంట్ గా హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'ది ఘోస్ట్' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు నాగార్జున. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' కు ధీటుగా దసరా బరిలో నిలిచింది. ట్రైలర్ తో మంచి టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ రిలీజ్ తరువాత ఆ స్థాయిలో పాజిటివ్ టాక్ ని రాబట్టలేకపోయింది. ఫ్లాప్ అనిపించుకుంది.
దీంతో నాగ్ జడ్జిమెంట్ పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఈ విసయాన్ని గ్రహించిన కింగ్ నాగార్జున 'ఏజెంట్' బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అక్కినేని అఖిల్ తో సురేందర్ రెడ్డి యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఏజెంట్'ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో నాగార్జున చాలా వరకు ఇన్ వాల్వ్ అయ్యారట. చాలా వరకు కీలక ఘట్టాల్లో మార్పులు చేయించారట. అయితే తనని వరుస ఫ్లాపులు వెంటాడుతున్న నేపథ్యంలో 'ఏజెంట్' మూవీ విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి కి నాగార్జున ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారని ఇన్ సైడ్ టాక్.
ఇదిలా వుంటే ఈ మూవీ తాజా షెడ్యూల్ ని బళ్లారి మైన్స్ లో ప్లాన్ చేశారు. అక్కడే క్లైమాక్స్ సన్నివేశాలని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. ఇందు కోసం సురేందర్ రెడ్డి అండ్ టీమ్ బళ్లారి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అక్కినేని అఖిల్ ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో హీరోగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలన్నది అఖిల్ ఆలోచన.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.