Begin typing your search above and press return to search.
మహేశ్ సరైన నిర్ణయమే తీసుకున్నాడా..?
By: Tupaki Desk | 16 Sep 2022 11:30 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కాలంలో బుల్లితెర మీద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ తెలుగులో తన కూతురు సితార ఘట్టమనేనితో కలిసి సీరియల్స్ - రియాలిటీ షోలను ప్రమోట్ చేస్తున్నారు. ఆ ఛానల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న కారణంగానే టీవీలో కనిపిస్తున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే 'డాన్స్ ఇండియా డాన్స్' అనే షోకి మహేష్ మరియు సితార ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఇదే క్రమంలో జీ తెలుగు ఛానల్ లోని దాదాపు అన్ని టీవీ సీరియల్ ప్రోమోలలో కనిపిస్తున్నారు. అయితే మహేష్ టీవీ సీరియల్స్ ను ప్రమోట్ చేయడం పై భారీగా ట్రోలింగ్ వస్తోంది. ఫ్యాన్స్ సైతం ఈ నిర్ణయం పై అసంతృప్తిగా ఉన్నారు.
మహేష్ బాబు లాంటి బిగ్ సూపర్ స్టార్ ఇలా టీవీ సీరియల్స్ - షోలలో కనిపించడం ఏంటని బాధ పడుతున్నారు. లిటిల్ ప్రిన్సెస్ సితార ను కూడా ఇలా స్మాల్ స్క్రీన్ మీద అరంగేట్రం చేయించడం సరైనది కాదని ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది.
మహేష్ మరియు నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా పోస్ట్ లను బట్టి చూస్తే.. వారు తమ ఇద్దరు పిల్లలు గౌతమ్ - సితార లను వెండితెరపై తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. అల్రెడీ '1 నేనొక్కడినే' సినిమాతో గౌతమ్ తెరంగేట్రం జరిగింది.
ఇక సితార తో 'సర్కారు వారి పాట' మ్యూజిక్ వీడియో చేయించారు. అలానే ఆమె క్లాసికల్ డ్యాన్స్ వీడియోలు మరియు ఇతర రీల్స్ ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంటాయి. దీంతో సితారకు ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.
అయితే సితార ను ఏదైనా సినిమాతో బిగ్ స్క్రీన్ మీదకు తీసుకొస్తారని భావిస్తే.. ఇలా సీరియల్ ప్రమోషన్ ద్వారా ఆమె అరంగేట్రం చేయడం ఎందుకని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యూహం యాంటీ ఫ్యాన్స్ కు ట్రోలింగ్ గా మారుతుందని.. వాళ్ళని డిపెండ్ చేయలేకపోతున్నామని అంటున్నారు.
నిజానికి టీవీల్లో కనిపించడం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరియు ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. 'బిగ్ బాస్' రియాలిటీ షో హోస్ట్ గా అక్కినేని నాగార్జున.. 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షోతో జూనియర్ ఎన్టీఆర్.. 'అన్ స్టాపబుల్' టాక్ షోతో బాలకృష్ణ ప్రేక్షకులకు ఎంత చేరువయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్ - షారుక్ ఖాన్ - అమితాబ్ బచ్చన్ లాంటి వారు టీవీ కార్యక్రమాలకు హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు కమల్ హాసన్ - కిచ్చా సుదీప్ - సూర్య - అక్షయ్ కుమార్ - హృతిక్ రోషన్ వంటి అనేక ఇతర బిగ్ స్టార్లు కూడా చిన్న టీవీ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నారు.
అప్పుడప్పుడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సీరియల్స్ లో స్పెషల్ అప్పీయరన్స్ ఇస్తుంటారు. ఎస్ఎస్ రాజమౌళి సైతం మూవీ ప్రమోషన్స్ కోసం గేమ్ షోకి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. టీవీ షోలను హోస్ట్ చేయడం లేదా మరేదైనా కార్యక్రమంలో పాల్గొనడం అనేది అన్ని మూలాలకు తీసుకెళ్ళడమే కాదు.. అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గర చేస్తుంది. ప్రతీరోజూ టీవీల్లో కనిపించేలా చేస్తుంది.
ఇది స్టార్ ఇమేజ్ ని రెట్టింపు చేస్తుందే తప్ప తక్కువ చేయదు. ఇవన్నీ ఆలోచించే మహేష్ బాబు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. సితార తెరంగేట్రం కంటే ముందే ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరవుతుందనే వ్యూహంతో జీ తెలుగు ఛానల్ తో డీల్ కుదుర్చుకొని ఉంటారని భావించవచ్చు. కాబట్టి ఈ ట్రోల్స్ చూసి సూపర్ స్టార్ డెసిజన్ ను తప్పుబట్టాల్సిన అవసరం లేదనేది మెజారిటీ వర్గాల అభిప్రాయం.
ఇకపోతే జీ తెలుగులో సీరియల్స్ - రియాలిటీ షోలు మరియు ఇతర కంటెంట్ ను ప్రమోట్ చేయడానికి మహేష్ బాబు దాదాపు రూ. 9 కోట్ల వరకూ తీసుకుంటున్నారని రూమర్స్ వచ్చాయి. సితారతో కలుపుకొని ఈ డీల్ సెట్ చేసుకొని ఉండొచ్చు. అయితే యాడ్స్ మరియు బ్రాండ్ ఎండోర్స్ మెంట్స్ కోసం మహేష్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నా.. అందులో ముప్పై శాతానికి పైగా సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటారు. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నిపుతుంటారు.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 వంటి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా 2023 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీని తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.