Begin typing your search above and press return to search.
ఆ నలుగుర్ని మెగాస్టార్ హోల్డ్ లో పెట్టారా?
By: Tupaki Desk | 16 Sep 2022 4:30 PM GMTఇటీవలి కాలంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాల వేగం పెంచిన సంగతి తెలిసిందే. కంబ్యాక్ తో భారీ సక్సెస్ అంవుదకున్న చిరంజీవి అటుపై 'సైరా నరసింహారెడ్డి'తో తనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. అటుపై మెగాస్టార్ వేగం ఒక్కసారిగా పెంచారు. ఒక సినిమా సెట్ లో ఉండగానే కొత్త కథలు వింటూ వాటిని లాక్ చేయడం మొదలు పెట్టారు.
'ఆచార్య' సినిమా రన్నింగ్ లో ఉండగానే..'గాడ్ ఫాదర్'... 'వాల్తేరు వీరయ్య'...'భోళా శంకర్' లాంటి మూడు చిత్రాల్ని వరుసగా వెంకదాని వెంట మరొకటి ప్రారంభించారు. ఇప్పటికే గాడ్ ఫాదర్ షూటింగ్ పూర్తిచేసిన చిరు ప్రస్తుతం వాల్తేరు వీరయ్య..భోళా శంకర్ షూటింగ్ పూర్తిచేసే పనిలో పడ్డారు. మొగాస్టారలో ఇంతటి వేగం మునుపెన్నడు చూడలేదు.
60 ప్లస్ లోనూ మెగాస్టార్ దూకుడుగా సినిమాలు చేయడం అభిమానుల్లో జోష్ ని నింపుతుంది. బాస్ రంగంలోకి దిగనంత వరకే..దిగితే ఎలా ఉంటుందన్నది తాజా సన్నివేశాన్ని బట్టి తెలుస్తోంది. అలాగే కొత్త దర్శకులకు అవకాశాలు ప్రకటించడంలోనూ అదే వేగం కనిపిస్తుంది. ఆ మధ్య పక్కా కమర్శియల్ ఈవెంట్ లో చిరంజీవి మారుతితో సినిమా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే .
ఆతర్వాత మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు.. అంతకు ముందు 'భీష్మ' దర్శకుడు వెంకీ కుడుమలతో...త్రివిక్రమ్ తో..పూరి జగన్నాధ్ తోనూ సినిమాలు చేస్తానని ప్రామిస్ చేసారు. మరి ఇప్పటివరకూ ఆప్రామిస్ నిలబెట్టుకున్నారా? అంటే లేదనే చెప్పాలి. వెంకీ కుడులమతో సినిమా చేస్తున్నట్లు రెండేళ్ల క్రితమే ప్రకటించారు. ఆ సినిమాకి నిర్మాతగా దానయ్యని ఫిక్స్ చేసారు.
వెంకీ కథ వినిపించడం...అందులో చిరు మార్పులు కోరడం ఇలా ఇద్దరి మధ్య కొంత ప్రయాణం సాగింది. కానీ ఆ తర్వాత ఆ సినిమా ఊసేలేదు.అంతకు ముందు నాలుగేళ్ల క్రితమే త్రివిక్రమ్ తో సినిమా ప్రకటించారు. ఆప్రాజెక్ట్ మాటల వరకే పరిమితమైంది. అటుపై డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రాజెక్ట్ విషయంలోనూ అదే జరిగింది.
ఇలా మెగాస్టార్ ఆ నలుగుర్ని చాలా కాలంగా హోల్డ్ లో పెట్టినట్లు కనిపిస్తుంది. చిరంజీవి పిలవాలేగానీ ఆ దర్శకులు ఎగిరి గంతేసి సినిమా చేయడానికి రెడీగా ఉంటారు. మరి ఆ ఛాన్స్ చిరంజీవి ఎందుకు కల్పించనట్లు? వాళ్లకన్నా వెనుకొచ్చిన దర్శకులు చిరుతో సినిమా చేస్తున్నారు గానీ... వీళ్లకెందుకు ఆ ఛాన్స్ రావడం లేదు? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరి వీటికి బధులు ఎప్పడు? అన్నది చిరంజీవి చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం ఆ నలుగురు దర్శకులు వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.