Begin typing your search above and press return to search.

నిఖిల్ రాంగ్ టైంలో వచ్చాడా..?

By:  Tupaki Desk   |   25 Dec 2022 7:42 AM GMT
నిఖిల్ రాంగ్ టైంలో వచ్చాడా..?
X
కార్తికేయ 2 లాంటి సూపర్ హిట్ తర్వాత దాన్ని మించే హిట్ సినిమాతో కంటెంట్ తో వస్తాడు అనుకున్న నిఖిల్ ఆ సినిమాతో పాటుగా పనిచేసిన 18 పేజెస్ సినిమాతో వచ్చాడు. సుకుమార్ రాసిన కథ కాబట్టి తప్పకుండా ప్రేక్షకులను కన్విన్స్ చేస్తుంది అన్న నమ్మకంతో సినిమా చేశాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఆఫర్ అంటే కాదనే సమస్యే లేదు. జోడీగా కార్తికేయ 2 లో నటించిన అనుపమనే ఫిక్స్ చేశారు. ఇన్ని ప్లస్ లు ఉన్న 18 పేజెస్ సినిమా సుకుమార్ మార్క్ టిపికల్ స్టోరీగా రాగా సినిమా రిలీజ్ తర్వాత వస్తున్న వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు.

ఈ సినిమా సోలోగా వచ్చుంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ సినిమాకు పోటీగా ధమాకా లాంటి మాస్ సినిమా వచ్చింది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కిన ధమాకా కథలో అంత దమ్ము లేకపోయినా సినిమా కామెడీగా నడిపించేశాడు. రవితేజ ఫ్యాన్స్ దీన్ని వారి భుజాల మీద వేసుకుని హిట్ చేసే పనిలో ఉన్నారు.

నిఖిల్ 18 పేజెస్ సినిమా ఈ వారం కాకుండా నెక్స్ట్ వీక్ అంటే డిసెంబర్ 30, 31న రిలీజ్ చేసి ఉంటే ఫలితం వేరే విధంగా ఉండేదని అంటున్నారు. సంక్రాంతి సినిమాలకు కూడా 12 రోజుల గ్యాప్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్ గా సరిపోయేది.

మరి అల్లు అరవింద్ ఈ కాలిక్యులేషన్ ఎక్కడ మిస్ అయిందో కానీ ధమాకా తో పాటే 18 పేజెస్ ని దించేశాడు. ఎందుకంటే ధమాకా జోష్ లో 18 పేజెస్ సినిమాని సరిగ్గా పట్టించుకోవట్లేదు.

అంతేకాదు మాస్ సెంటర్స్ లో 18 పేజెస్ సినిమా చూడాలన్న ఆసక్తి కూడా ఆడియన్స్ చూపించట్లేదు. అందుకే ధమాకా తో కాకుండా 18 పేజెస్ నెక్స్ట్ వీక్ రిలీజ్ అయ్యుంటే కచ్చితంగా రిజల్ట్ వేరేలా ఉండేదని అంటున్నారు. అయితే మేకర్స్ మాత్రం సొంతంగా రిలీజ్ చేశారు కాబట్టి సినిమా ఆల్రెడీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ తోనే ప్రాఫిట్స్ రాబట్టడంతో థియేట్రికల్ బిజినెస్ ఎంత చేసినా.. ఎంత వసూలు చేసినా సరే పర్వాలేదు అన్నట్టు ఉన్నారు.

18 పేజెస్ సినిమా మొదటి రోజే 15 కోట్ల గ్రాస్ అని పోస్టర్ వేశారు గీతా ఆర్ట్స్ వారు. అందులో ఎంత వాస్తవం ఉంది అంటూ ఆడియన్స్ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. కార్తికేయ 2 తో నిఖిల్ రేంజ్ పెరిగింది కానీ ఫస్ట్ డే తోనే 15 కోట్ల గ్రాస్ తెచ్చే స్టామినా రాలేదని చెబుతున్నారు. ఏది ఏమైనా రాంగ్ టైమింగ్ లో వచ్చిన నిఖిల్ రిజల్ట్ పరంగా కన్నా బిజినెస్ పరంగా మాత్రం 18 పేజెస్ తో హిట్ కొట్టినట్టే లెక్క.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.